UP Election 2022 : తుది అంకం రేప‌టితో ప‌రిస‌మాప్తం

54 సీట్ల‌పై అన్ని పార్టీలు ఫోక‌స్

UP Election 2022 : ప‌వ‌ర్ లో ఉన్న బీజేపీ ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది ఉత్తర్ ప్ర‌దేశ్ లో. మొత్తం 403 సీట్ల‌కు గాను ఆరు విడుత‌ల పోలింగ్ పూర్త‌యింది. ఇక ఒకే ఒక్క ఆఖ‌రి విడుత పోలింగ్ మిగిలి ఉంది.

ఈనెల 7తో ఆఖ‌రి విడుత పూర్త‌యితే దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో ఎన్నిక‌లకు సంబంధించిన పోలింగ్ పూర్త‌యిన‌ట్లే. ఇక ఏడో విడుత‌లో మొత్తం 54 సీట్ల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర వ్య‌తిరేకత‌ను ఎదుర్కొంటున్నారు. ప్ర‌ధానంగా రైతులు, నిరుద్యోగుల నుంచి ఇబ్బంది ఎదుర్కొంటోంది క‌మ‌లం. వార‌ణాసిలో ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు ప్ర‌ధాని మోదీ.

ఈసారి స‌ర్వేల హ‌ల్ చ‌ల్ కు చెక్ పెట్టింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఈ స‌ర్వేలు ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేశాయి. దీంతో ఎన్నిక‌ల ఫ‌లితాలు(UP Election 2022) వ‌చ్చేంత దాకా స‌ర్వేలు బ‌య‌ట పెట్ట‌వ‌ద్దంటూ స్ప‌ష్టం చేసింది ఈసీ.

ఇందులో భాగంగా పూర్వాంచ‌ల్ ప‌రిధిలోనే ఈ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. మోదీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసితో పాటు ఎస్పీ చీఫ్ ఎంపీగా ఉన్న అజంగ‌ఢ్ , మీర్జాపూర్ , మౌవ్ , జాన్ పూర్ , ఘాజీపూర్ , చ‌న్ దౌలి, భ‌దౌహి, సోన్ భ‌ద్ర జిల్లాలు చివ‌రి విడుత ఎన్నిక‌ల జాబితాలో ఉన్నాయి.

యోగి నేతృత్వంలోని బీజేపీకి ఎస్పీ నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. ఈ త‌రుణంలో ఈసారి జరుగుతున్న ఎన్నిక‌ల్లో విజ‌యం అంత సుల‌భం కాద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : 11న ఆశిష్ మిశ్రాపై సుప్రీం విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!