Venkaiah Naidu : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని సూచించారు.
ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలికి తీయాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. ఇవాళ హైదరాబాద్ లో ముట్నూరి సంపాదకీయాలు పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
అనంతరం ఉప రాష్ట్రపతి మాట్లాడారు. ప్రచురణ, ప్రసార మాధ్యాలపై ప్రజలకు ఎనలేని ఆశలు ఉంటాయన్నారు. గతంలో కంటే ప్రస్తుతం మీడియాలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
సమాజంలో మార్పులు తీసుకు వచ్చేలా పత్రికలు, చానళ్లు కృషి చేయాలని సూచించారు. వాస్తవాలను తమ అభిప్రాయాలను జోడించకుండా ఉన్నది ఉన్నట్లుగా చేరవేసేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు.
పత్రికలు సత్యానికి దగ్గరగా సంచలనాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు వెంకయ్య నాయుడు. అంతే కాకుండా ప్రభుత్వాలు ఏవైనా సరే అవి చేస్తున్న తప్పులను ఎత్తి చూపాల్సిన బాధ్యత కూడా ప్రచురణ, ప్రసార మాధ్యమాలపై ఉందన్నారు.
చిన్న చిన్న విషయాలను, అప్రధాన్య వార్తలను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నాలను మాను కోవాలని హితవు పలికారు ఉప రాష్ట్రపతి.
అక్షరంపై సాధికారత కలిగిన వారే జర్నలిజంలో రాణిస్తారని అందుకు మట్నూరి వారి సంపాదకీయాలు నిదర్శనమన్నారు.
పత్రికలు అత్యంత శక్తివంతమైనవని అన్నారు. అవి లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించ లేమన్నారు. జీవిత విధానాన్ని ఆలోచనల్ని సరైన దారుల్లో పెట్టగల ఏకైక శక్తి వీటికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు వెంకయ్య నాయుడు(Venkaiah Naidu).
కృష్ణారావు రాసిన సంపాదకీయాలు నేటి తరానికి కూడా స్పూర్తిని కలిగిస్తాయని చెప్పారు.
Also Read : శ్రీవారి భక్తులకు తీపి కబురు