Telangana Budget : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు 2022-23 వార్షిక బడ్జెట్ (Telangana Budget)ను శాసనసభలో ఇవాళ ప్రవేశ పెట్టారు. రూ. 2, 56, 958.51 కోట్లతో హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
ఇందులో రెవెన్యూ ఖర్చు రూ. 1.89 లక్షల కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం రూ. 29, 728 కోట్లుగా ఉంది. ఈ సందర్భంగా హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెడుతూ ప్రసంగించారు. రాష్ట్రం ఆవిర్భవించిన స్వల్ప కాలంలోనే అద్భుతమైన ప్రగతిని సాధించామని చెప్పారు.
దేశంలోనే అన్ని రంగాలలో తెలంగాణ టాప్ లో ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకు వెళుతున్నారని చెప్పారు హరీష్ రావు.
పరిపాలనలో కొత్త పంథాను అవలంభిస్తూ ముందుకు వెళుతోందన్నారు. రాజీలేని వైఖరితో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. గతంలో ఉన్న సమస్యలకు చెక్ పెట్టామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధును ప్రవేశ పెట్టామన్నారు. విద్యుత్ కోతలు, ఆకలి చావులు లేని ప్రాంతంగా తీర్చి దిద్దామని ఈ ఘనత అంతా తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్(Telangana Budget) అని కొనియాడారు.
ఇదిలా ఉండగా సభకు ఆటంకం కలిగించారంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
బడ్జెట్ ప్రసంగానికి అడ్డు పడుతున్నారని ఆరోపిస్తూ ఈటల రాజేందర్ , రఘునందన్ రావు, రాజాసింగ్ లను శాసనభ సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెన్షన్ విధిస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.
Also Read : రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ కు రావాలని చిరంజీవికి ఆహ్వానం..!