Punjab Aap : దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికల పర్వం ముగిసింది. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం హోరెత్తిస్తున్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను తమ పనితీరుకు రెఫరెండమ్ గా భావించాయి.
విచిత్రం ఏమిటంటే ఉత్తరాఖండ్ లో హస్తం పవర్ లోకి రానుందని సమాచారం.
ఇదే సమయంలో పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండో ప్లేస్ కు వెళుతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ కుండ బద్దలు కొడుతున్నాయి.
ఓ వైపు చరణ్ జిత్ సింగ్ చన్నీ ఇంకో వైపు సిద్దూ కలిసి ప్రచారం చేసినా ఎందుకనో
ఈసారి భగవంత్ మాన్ కే పట్టం కట్టినట్లు టాక్. పలు మీడియా సంస్థలన్నీ ఆప్ వైపు ఎడ్జ్ ఉందంటూ పేర్కొనడం విశేషం.
ఆమ్ ఆద్మీ పార్టీకి 76 నుంచి 90 సీట్లు, కాంగ్రెస్ కు 19 నుంచి 31 సట్లు, అకాళీ దళ్ కు 7-11 సీట్లు , ఇతరులకు ఒకటి నుంచి 4 సీట్లు వస్తాయని ప్రకటించాయి.
మరో ప్రముఖ ఛాన ల్ మాత్రం ఆప్ కు 51 నుంచి 61 సీట్లు వస్తాయని కాంగ్రెస్ కు 22 నుంచి 28 సీట్లు వస్తాయని ,
అకాళీదళ్ కు 20 నుంచి 26 సీట్లు మాత్రమే రానున్నట్లు అంచనా వేసింది.
ఇక టైమ్స్ నౌట్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆప్ కు 70, కాంగ్రెస్ కు 22, ఎస్ఏడీకి 19
, బీజేపీ కూటమికి 5 , ఇతరులు ఒకటి చొప్పున గెలుచుకుంటారంటూ తెలిపింది.
న్యూస్ 24 – టుడేస్ చాణక్య ప్రకారం ఆప్ కు 89 నుంచి 111 , కాంగ్రెస్ కు 3 నుంచి 7 , ఇతరులు 2 చోట్ల విజయం సాధిస్తారని అంచనా వేసింది.
మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలోని కుమ్ము లాటలే కొంప ముంచాయని అంచనా. ఏది ఏమైనా భగవంత్ మాన్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారన్నమాట.
Also Read : పుతిన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ