AP CM : సాధికార‌త‌కు మ‌హిళ‌లు ప్ర‌తినిధులు

కొనియాడిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

AP CM : ఏపీలో మ‌హిళ‌లు అన్ని రంగాల‌లో రాణిస్తూ స్పూర్తి దాయ‌కంగా నిలుస్తున్నార‌ని అన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి(AP CM ). కాపు నేస్తం ద్వారా రూ. 982 కోట్లు సాయం చేశామ‌ని చెప్పారు.

ఈబీసీ నేస్తం ద్వారా సాయం అందిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌తి గ్రామ స‌చివాల‌యంలో మ‌హిళా పోలీస్ ను నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇలాంటి ప్ర‌క్రియ దేశంలో ఎక్క‌డా లేద‌న్నారు.

డిప్యూటీ సీఎం, హోం మంత్రి ప‌ద‌వుల‌తో పాటు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో 51 శాతం మ‌హిళ‌లే ప‌ని చేస్తున్నార‌ని చెప్పారు జ‌గ‌న్. 31 ల‌క్ష‌ల ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చామ‌న్నారు. విద్యా దీవెన‌, వ‌స‌తి దీవెన కూడా క‌ల్పించామ‌న్నారు.

సంపూర్ణ పోష‌ణ ప‌థ‌కం ద్వారా 34.16 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు మేలు చేకూరుతోంద‌న్నారు. ఇందు కోసం రూ. 2 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని తెలిపారు సీఎం.

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం దిశ చ‌ట్టం, దిశ యాప్ , దిశ పీఎస్ లు తీసుకు వ‌చ్చామ‌ని అన్నారు జ‌గ‌న్ రెడ్డి(AP CM ). దేశంలో ఎక్క‌డా లేని విధంగా కోటి 13 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నార‌ని అన్నారు.

వాలంటీర్లుగా 53 శాతం మ‌హిళ‌లే ఉండ‌డం విశేష‌మ‌న్నారు. అమ్మ ఒడి ప‌థ‌కం ద్వారా రూ. 13 వేల కోట్లు ఇచ్చామ‌ని చెప్పారు. ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన పెన్ష‌న్ ఇస్తున్నామ‌ని తెలిపారు సీఎం.

ఇంట‌ర్నేష‌న‌ల్ విమెన్స్ డే సంద‌ర్భంగా వేడుక‌ల్లో హాజ‌ర‌య్యారు. ప్ర‌తి మ‌హిళ‌లో ఆత్మ విశ్వాసం క‌నిపిస్తోంద‌న్నారు. రాష్ట్రంలో జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ లుగా 54 శాతం మంది మ‌హిళ‌లే ఉన్నార‌ని అన్నారు.

Also Read : కీల‌క నిర్ణ‌యాల‌కు ఏపీ ఆమోదం

Leave A Reply

Your Email Id will not be published!