PPP March : పాకిస్తాన్ లో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. 24 గంటల్లోగా రాజీనామా చేయాలని డెడ్ లైన్ విధించాయి.
ఇమ్రాన్ ఖాన్ హయాంలో పాలన దారుణంగా తయారైందన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందంటూ ఆరోపించాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(PPP March) నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు భారీ ఎత్తున పాకిస్తాన్ లో ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్బంగా పీపీపీ నేత బిలావర్ భుట్టో మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ తన పీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దమ్ముంటే పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాలని హెచ్చరించారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని ధ్వజమెత్తారు. సైనికుల కనుసన్నలలో నడుస్తూ పాలన సాగిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. కరెంట్ అకౌంట్ లోటు పెరిగిందని, విదేశీ మారక ద్రవ్యం నిల్వలు క్షీణిస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ కు సైనిక చీఫ్ లకు మధ్య పొసగడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇంకో వైపు ఏ దేశమూ దాని వైపు చూడడం లేదు.
ఈ తరుణంలో ఇటీవల రష్యా వద్దకు వెళ్లి స్నేహం కోసం పాకులాడటాన్ని తప్పు పట్టారు పాకిస్తాన్ ప్రజలు. అయితే వీటిని పీఎం ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి బాగా లేదన్న సమాచారం.
Also Read : ఒప్పుకుంటే యుద్దం ఆపేస్తాం