KCR : అసెంబ్లీలో ఇవాళ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేల 39 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాల్టి నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తారని చెప్పారు.
ఇందులో భాగంగా కొందరు కోర్టుకు ఎక్కడం, రాష్ట్రపతి నుంచి ఆమోద ముద్ర రాక పోవడం, తదితర కారణాల రీత్యా జాబ్స్ కు సంబంధించి గత కొంత కాలం నుంచి నోటిఫికేషన్లు ఇవ్వలేక పోయామన్నారు కేసీఆర్(KCR ).
ఎంతో కాలంగా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని 10 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్.
దీని వల్ల మరింత మంది ఉద్యోగాలు ఆశించే వారికి అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏళ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ట వయో పరిమితి పెరుగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ముందుకు వచ్చిందని, ఆ మేరకు రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు ఈ సందర్భంగా కేసీఆర్(KCR ). మానవతా దృక్ఫథంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
అంతే కాకుండా ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు పద్దతిన పని చేస్తున్న 11 వేల 104 మందిని పర్మినెంట్ చేస్తున్నామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ ఒక్క ప్రకటనతో వేలాది మందికి జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుంది.
Also Read : నారీ శక్తి పురస్కారాలు ప్రదానం