Modi : దేశాన్ని అమ్మకానికి పెట్టే సమయం ఆసన్నమైంది. తాను చాయ్ వాలా నంటూ ప్రకటించి జనాన్ని నమ్మించి పవర్ లోకి వచ్చిన మోదీ(Modi) ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేశారు.
ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అమ్మే పనిలో పడ్డారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ముగ్గురు లేదా నలుగురు వ్యాపారవేత్తల కోసం ఆయన పని చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆ పార్టీ చెప్పినట్టుగానే మోదీ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ భూముల నగదీకరణ కోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ – ఎన్ఎల్ఎంసీ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్ – ఎస్పీవీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రైవీకరణ జపం చేస్తూ వస్తోంది బీజేపీ సంకీర్ణ సర్కార్. ప్రైవేటీకరిస్తున్న, మూత పడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలకు చచెందిన భవనాలు, మిగులు భూముల నిర్వహణ, అమ్మకానికి ఈ కొత్త కంపెనీని కేంద్రం తీసుకు వస్తోంది.
ప్రైవేటీకరణ, ఆస్తుల నగదీకరణపై ఇవాళ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాన మంత్రి మోదీ(Modi) మాట్లాడనున్నారు. ఇదిలా ఉండగా ఎస్పీవీని రూ. 5 వేల కోట్ల అధికారిక షేర్ క్యాపిటల్ , రూ. 150 కోట్ల పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ తో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
నిరుపయోగంగా ఉన్న ఆస్తులను విక్రయించి కొత్త వనరులను సృష్టిస్తుందంటూ పేర్కొంది. ఇదిలా ఉండగా లాభాలలో ఉన్న ఆస్తులను సైతం అమ్మకానికి లేదా ప్రైవేటీకరణ చేసేందుకు మోదీ సర్కార్ యత్నించడంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Also Read : రాజకీయాల్లోకి వస్తా బీజేపీపై పోరాడుతా