Pushkar Singh Dhami : మోదీ మార్క్ పని చేయలేదు. అమిత్ షా ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఉత్తరాఖండ్ లో ఏకంగా ఆ పార్టీకి చెందిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ(Pushkar Singh Dhami )ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు.
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలలో బీజేపీ విజయం సాధించినా సీఎం మాత్రం పరాజయం పాలు కావడంతో పార్టీ హైకమాండ్ పునరాలోచనలో పడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
పంజాబ్ లో సీఎం చన్నీతో పాటు పీసీసీ చీఫ్ సిద్దూ , మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓడి పోయారు. ఇక ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి హరీష్ రావత్ సైతం ఓటమి పాలయ్యారు.
ఇది ఆ పార్టీకి కూడా కోలుకోలేని షాక్ తగిలింది. ఇక సీఎం ధామీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పోటీ చేసిన ఖతిమా నియోజకవర్గం నుంచి ఓడి పోయారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భువన్ కప్రీ చేతిలో ఘోర పరాజయం పొందారు.
ధామీపై భువన్ చంద్ర కప్రీ 6 వేల 951 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ధామికి 40 వేల 675 ఓట్లు రాగా భువన్ కప్రీకి 47 వేల 626 ఓట్లు వచ్చాయి.
70 స్థానాలలో బీజేపీ మరోసారి పవర్ లోకి రానుంది. ఇంకోసారి పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ సీఎంగా కొలువు తీరనున్నారు. రాష్ట్రంలో 70 స్థానాల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ చివరి దాకా పోటీ ఇచ్చినా ఫలితం లేక పోయింది.
Also Read : గోవాలో బీజేపీదే అధికారం సావంత్ సీఎం