Labh Singh : ఎవరీ లభ్ సింగ్ ఉగోకే అనుకుంటున్నారా. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సామాన్యుడు నిన్నటి దాకా. కానీ ఇవాళ హీరో.
ఎందుకంటే పంజాబ్ సీఎంగా ఉన్న చరణ్ జిత్ సింగ్ చన్నీని ఓడించిన వ్యక్తి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ లభ్ సింగ్ కు ఏరికోరి సీటు ఇచ్చింది.
పంజాబ్ రాజకీయాలలో ఇప్పుడు అతడి పేరు హల్ చల్ గా మారింది. నెట్టింట్లో ఎవరీ లభ్ సింగ్ (Labh Singh )ఉగోకే అంటూ వెతకడం ప్రారంభించారు.
విజయం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేరు. ఓటమి ఎప్పుడు పలకరిస్తుందో ఊహించ లేం. పంజాబ్ రాష్ట్రంలోని బర్నాలా జిల్లా బదౌర్ ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి లభ్ సింగ్ పోటీ చేశారు.
సీఎం చన్నీ కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కానీ ఊహించని రీతిలో చన్నీ ఓటమి పాలయ్యాడు. ఏకంగా మనోడికి 63 వేలకు పైగా ఓట్లు రాగా చన్నీకి కేవలం 26 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.
దీంతో చన్నీపై 37 వేల అత్యధిక మెజారిటీ సాధించి అందరినీ విస్తు పోయేలా చేశాడు ఈ ఆప్ కు చెందిన సామాన్యుడు. ఇప్పుడు లభ్ సింగ్(Labh Singh )కు వయసు 35 ఏళ్లు.
అత్యంత సామాన్య కుటుంబం. లభ్ సింగ్ మొబైల్ షాప్ లో రిపేరర్. 2013లో ఆప్ లో వలంటీర్ గా చేరాడు. అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం ఇల్లిల్లు తిరిగాడు.
గెలిపిస్తే మీతోనే ఉంటానని హామీ ఇచ్చాడు. ఇక్కడి జనం చన్నీని ఓడించడం ఖాయమంటూ సంచలన కామెంట్స్ కూడా చేశాడు లభ్ సింగ్. అతడు చెప్పినట్లే ప్రజలు పట్టం కట్టారు. అసెంబ్లీకి పంపించారు.
Also Read : ప్రజా తీర్పును స్వీకరిస్తున్నాం