Sanjay Raut : దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై శివసేన పార్టీ స్పందించారు. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి బీజేపై నిప్పులు చెరిగారు. విజయ గర్వం తలకెక్కితే ప్రమాదమన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పుడు గెలుస్తారో ఇంకెప్పుడు ఓడి పోతారో చెప్పలేమన్నారు. గెలుపును జీర్ణించు కోవడం నేర్చు కోవాలని సూచించారు రౌత్.
బీజేపీ ఉపయోగించిన నోట్ల కట్టల కంటే తక్కు పడినందున తమ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిర్వహణ సరిగా చేపట్టలేక పోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అక్కడ అధికారంలో ఉండి కూడా ప్రజల వద్దకు వెళ్లలేక పోయిందన్నారు. ఉత్తర ప్రదేశ్ , ఉత్తరాఖండ్ లలో విజయాలు సాధించి మణిపూర్ ,గోవాలలో బోటా బోటీగా వచ్చిందన్న విషయం బీజేపీ గుర్తుంచు కోవాలన్నారు సంజయ్ రౌత్(Sanjay Raut).
తమ పార్టీ తరపున నిలబెట్టిన వారు ఖాతా తెరవక పోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ట్రబుల్ షూటర్ అమిత్ షాలు పంజాబ్ లో ఏం ప్రభావం చూపించారని ప్రశ్నించారు.
వైఫల్యాన్ని జీర్ణించు కోవడం అన్నది చాలా ఈజీ. కానీ గెలుపును జీర్ణించు కోవడం అన్నది బీజేపీ ముందు నేర్చుకోవాలన్నారు. యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ ఆశించిన మేర ప్రదర్శన చేయలేక పోయిందన్నారు సంజయ్ రౌత్.
ఈ విజయాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రం మరింత రెచ్చిపోయే ఛాన్స్ ఉందన్నారు. కానీ బీజేపీని ఎలా వంచాలో తమకు తెలుసన్నారు. ఎన్ని దాడులు చేసినా శివ సేన తలవంచదని తెలుసుకుంటే బెటర్ అన్నారు రౌత్.
Also Read : 2024 ఎన్నికల్లోనూ మాదే అధికారం