AP Budget 2022-23 : ఏపీ అసెంబ్లీలో 2022-23 సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఇవాళ ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన నవరత్నాల సంక్షేమానికి పెద్ద పీట వేశారు.
ఈ బడ్జెట్ పై ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉంది. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మహిళా సాధికారత, ఐటీ కి అధిక(AP Budget 2022-23) ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి రూ. 18 వేల కోట్లు కేటాయించింది.
ఇక వైఎస్సార్ భరోసా కింద రూ. 3 వేల 900 కోట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఏపీలో రెవెన్యూ ఖర్చు రూ. 2,08, 261 కోట్లుగా ఉండగా మూల ధన ఖర్చు రూ. 47 వేల 996 కోట్లు, రెవిన్యూ లోటు రూ. 17, 036 కోట్లు ఉందంటూ తెలిపింది ఏపీ ప్రభుత్వం.
ద్రవ్య లోటు రూ. 48 వేల 724 కోట్లు కేటాయించింది. కాగా బడ్జెట్ ప్రవేశే పెట్టక ముందు సోషియో ఎకనామిక్ ను ఏపీ సీఎం జగన్ రెడ్డి విడుదల చేశారు. వ్యవసాయం రంగంలో 14.5 శాతం ప్రగతి నమోదు చేసిందన్నారు.
గణనీయంగా వృద్ధి రేటు పెరిగిందన్నారు. పరిశ్రమల సెక్టార్ లో 25.5 శాతం, సేవల రంగంలో 18.9 శాతం నమోదు కావడాన్ని అభినందించారు. వివిధ సంక్షేమ పథకాల్లో ప్రగతి వల్ల సుస్థిర అభివృద్ధి పెరిగిందన్నారు.
వ్యవసాయం, మహిళా సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు అధికంగా కేటాయింపులు జరిగాయి. ఇందులో భాగంగా నవరత్నాల పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
సీఎం జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన జనార్దన్ రెడ్డి.
Also Read : యువతకు ఆదర్శం రషీద్ జీవితం – ఎస్పీ