Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut )సంచలన కామెంట్స్ చేశారు. ఆయన బీఎస్పీ చీఫ్ కుమారి మాయావతి, ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై సెటైర్లు వేశారు.
ఉత్తర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ గెలుపొందేందుకు దోహద పడిన మాయావతి, ఓవైసీలకు పద్మ విభూషణ్ , భారతరత్న ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. యూపీలో తిరిగి పవర్ లోకి వచ్చేలా శాయశక్తులా వీరిద్దరూ కృషి చేశారని పేర్కొన్నారు.
కాగా సమాజ్ వాది పార్టీకి గతంలో కంటే సారి ఓటు శాతం పెరిగిందన్నారు. గతంలో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 42 స్థానాల నుంచి 125 స్థానాలకు పెంచుకుందన్నారు. తక్కువ ఓట్ల తేడాతో మరో 50 నుంచి 70 స్థానాలు కోల్పోయిందన్నారు.
ఒక రకంగా చూస్తే మూడు రెట్లు పెరిగిన దానిని గుర్తించాలన్నారు సంజయ్ రౌత్(Sanjay Raut ). బీజేపీ సక్సెస్ లో బీఎస్పీ, ఎంఐఎం కీలక పాత్ర పోషించాయని ఆరోపించారు.
బీజేపీ గెలుపొందడంలో తాము ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. ఒక వేళ ప్రధాని మోదీ, షా ద్వయం ప్రభావం ఉంటే ఉత్తరాఖండ్ లో సాక్షాత్తు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎందుకు ఓడి పోయారని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
పంజాబ్ లో అడ్రస్ లేకుండా పోయిందన్నారు. ఇక గోవాలో చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్న చందంగా తయారైందన్నారు. బీజేపీ వంటి జాతీయ పార్టీని పంజాబ్ లో పూర్తిగా పక్కన పెట్టారంటూ స్పష్టం చేశారు సంజయ్ రౌత్.
ఆ రాష్ట్రంలో మోదీ, అమిత్ షా పర్యటించినా దిక్కు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఫలితాలు ప్రభావం చూపవన్నారు.
Also Read : గెలుపు సరే రైతుల మాటేంటి