Modi Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో అద్బుత విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలోని 117 సీట్లకు గాను ఆప్ 92 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
అఖండ విజయాన్ని నమోదు చేసిన ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Modi Kejriwal )కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
పంజాబ్ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కేజ్రీవాల్ కు గ్రీటింగ్స్ తెలియ చేస్తూ ట్వీట్ చేశారు.
ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు అనుగుణంగా ఆప్ పాలన అందించ గలదన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఉప్పు నిప్పు లాగా ఉన్న మోదీ ఉన్నట్టుండి తనను అభినందించడంపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ కు సమాధానం ఇచ్చారు.
థాంక్యూ సర్ అని సీఎం పేర్కొన్నారు. కాగా పంజాబ్ లో ఎన్నడూ లేని రీతిలో భారీ ఎత్తున సీట్లను కొల్లగొట్టిన ఆప్ ప్రధాన పార్టీలకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని 18 సీట్లకు పరిమితం చేసింది. ముందే ప్రకటించినట్లుగానే భగవంత్ మాన్ ను సీఎం అభ్యర్థిగా డిక్లేర్ చేసింది. ఆయన ఈనెల 16న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆప్ కొట్టిన దెబ్బకు చన్నీ, సిద్దూ, బాదల్ , మజిథియా మట్టి కరిచారు.
Also Read : చన్నీ రాజీనామా గవర్నర్ కు సమర్పణ