Kamal Haasan : తమిళనాడు సినీ రంగంలో కమల్ హాసన్ కు మంచి పేరుంది. అక్కడ సక్సెస్ అయినా ఎందుకనో రాష్ట్ర రాజకీయాలలో మాత్రం ఆయనకు నిరాశే ఎదురవుతోంది.
మక్కల్ నీది మయ్యం అనే పేరుతో పార్టీని స్థాపించి సంచలనం సృష్టించిన కమల్ హాసన్(Kamal Haasan) చివరకు తాను కూడా ఓడి పోయాడు. ప్రస్తుతం ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను స్వయంగా కమల్ హాసన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. వీరిద్దరూ చాలా సేపు చర్చించుకున్నారు.
పంజాబ్ లో అఖండ విజయాన్ని సాధించినందుకు తాను ప్రత్యేకంగా అరవింద్ కేజ్రీవాల్ ను అభినందించినట్లు తెలిపారు కమల్ హాసన్. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
నా సోదరుడు సాధించిన ఈ విజయం తనను ఎంతగానో సంతోషానికి గురి చేసిందని పేర్కొన్నారు కమల్ . వీరిద్దరి కలయిక ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తమిళనాడులో రాబోయే రోజుల్లో ఆప్ తో కలిసి మక్కల్ నీది మయ్యం బరిలోకి దిగనుందని సమాచారం. ఇంకా టైముంది కాబట్టి ప్రస్తుతానికి ఆప్ హిమాచల్ ప్రదేశ్ , రాజస్థాన్ లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది.
ఇప్పటికే తన పనిని ప్రారంభించింది. ఇక పంజాబ్ లో 117 సీట్లకు గాను 92 సీట్లు సాధించి ఆప్ చరిత్ర సృష్టించింది. ఇప్పటికే కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలంటూ మొదటిసారిగా కేజ్రీవాల్ కోరారు. దీంతో వీరిద్దరి మధ్య బంధం ఇంకా
Also Read : దిగ్గజాల కలయికపై సర్వత్రా ఆసక్తి