Zelensky : రష్యా తన పంతం నెగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతోంది. మరో వైపు యుద్దాన్ని మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ఆర్థిక ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఐక్య రాజ్య సమితి, అమెరికా, యూరోపియన్ కంట్రీస్ , బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా ప్రతి దేశం రష్యాపై కన్నెర్ర చేస్తున్నాయి. ఇంకో వైపు రష్యాకు మిత్రదేశంగా ఉన్న భారత్ పై వత్తిడి పెరుగుతోంది.
ఈ తరుణంలో ఉక్రెయిన్ తగ్గడం లేదు. ఓ వైపు బాంబుల మోత మోగిస్తోంది. ఇంకో వైపు మిస్సైళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చర్చలకు సిద్దం అంటూనే యుద్దానికి సై అంటున్నాయి ఇరు దేశాలు. అటు పుతిన్ ఇటు జెలెన్ స్కీ (Zelensky )మాటల తూటాలు పేలుస్తున్నారు.
తాజాగా జెలెన్ స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుతిన్ ను రెచ్చగొట్టేలా కామెంట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మీ వద్ద చాలా ఆయుధాలు, సామాగ్రి ఉండవచ్చు. కానీ మా వద్ద బలం లేక పోయినా గెలిచే సత్తా తమకు ఉందని ప్రకటించాడు.
ఓడి పోయినా సరే తల వంచే ప్రసక్తి లేదన్నాడు జెలెన్ స్కీ. ఇరు వైపుల నుంచి భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ యుద్ధంలో ఎక్కువగా నష్ట పోయింది మాత్రం ఉక్రెయిన్ అని చెప్పక తప్పదు.
కానీ ఎక్కడా తగ్గడం లేదు జెలెన్ స్కీ. చర్చలకు రెడీ అంటూనే కయ్యానికి కాలు దువ్వుతుండడం ఇరు దేశాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు 12 వేల మంది రష్యా సైనికుల్ని కాల్చి చంపామన్నాడు జెలెన్ స్కీ.
Also Read : ఉక్రెయిన్ కు అమెరికా ఖుష్ కబర్