Venzy Viegas : గోవాలో మార్పు మొద‌లైంది

ఆప్ నేత వెంజీ విగాస్

Venzy Viegas  : గోవాలో మార్పు రాజ‌కీయాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని అన్నారు జెయింట్ కిల్ల‌ర్ ఆప్ ఎమ్మెల్యే వెంజీ విగాస్(Venzy Viegas ). ఆయ‌న మాజీ సీఎం చ‌ర్చిల్ అలెమావోపై విజ‌యం సాధించారు. బెనెలిం లేదా వెలిమ్ లోనే కాదు గోవాలో కూడా మార్పులు చోటు చేసు కోవ‌డం ఖాయ‌మ‌న్నారు.

ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తామ‌ని చెప్పారు. ప‌నాజీలో వెంజీ విగాస్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. గోవా ప్ర‌జ‌లు సుప‌రిపాల‌న కోరుకుంటున్నార‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా తృణ‌మూల్ అభ్య‌ర్థి చ‌ర్చిల్ అలెమావోపై 1,200 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.

గోవా రాష్ట్రంలో త‌న రెండో అసెంబ్లీలో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాల‌ను గెలుచుకుంది. బెనౌలిమ్, వెలిమ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో విజ‌యం సాధించింది ఆప్. మిగ‌తా పార్టీలు డ‌బ్బులు వెద‌జ‌ల్లాయి.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలుపొందారంటూ ఆరోపించారు. కానీ కండ బ‌లం లేకుండా ఎన్నిక‌ల్లో పోరాడ‌వచ్చ‌ని తాము నిరూపించామ‌ని చెప్పారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాము ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తాన‌ని స్ప‌ష్టం చేశారు ఆప్ ఎమ్మెల్యే(Venzy Viegas ).

తాను సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని, త‌న కుటుంబం నుంచి ఎవ‌రూ రాజ‌కీయాల్లోకి రాలేద‌న్నారు వెంజీ విగాస్. ప్ర‌జ‌లు త‌న‌పై విశ్వాసం ఉంచి గెలిపించార‌ని వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని చెప్పారు.

భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు ఆప్ ఒక్క‌టే ఆశాజ‌నకంగా ఉంద‌న్నారు. బెనౌలిమ్ లోని అన్ని ఇళ్ల‌కు నీళ్లు వ‌చ్చేలా చేస్తాన‌ని అన్నారు. ఇందు కోసం నా నియోజ‌క‌వ‌ర్గంలోని పంచాయ‌తీల స‌ర్పంచ్ లంద‌రితో మాట్లాడాన‌ని  చెప్పారు.

Also Read : దేశ భ‌ద్ర‌త‌పై మోదీ స‌మావేశం

Leave A Reply

Your Email Id will not be published!