దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ (Lakhimpur Kheri) ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న (Union Minister) తనయుడు (Ashish Mishra) కు (Allahabad High Court) (bail granted) చేసింది.
ఆయనకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ బాధిత రైతు కుటుంబీకులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయా కుటుంబాల తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు.
ఇవాళ సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు కు సంబంధించి విచారణ చేపట్టింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ యూపీలో గెలిచిందని, దీంతో మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని తెలిపారు.
అంతే కాకుండా ఇప్పటికే ఒకరిపై దాడికి కూడా దిగారని వాపోయారు. దీంతో విచారణ చేపట్టిన భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ సీరియస్ గా తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా విచారణకు ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తీర్పు వెలువరించారు. కేసును రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఈ కేసులో ఇతర నిందితులు కూడా ప్రధాన నిందితుడితో సమానంగా ఉండాలని కోరుతూ బెయిల్ కోసం (Allahabad High Court) ను ఆశ్రయిస్తున్నారని న్యాయవాది తెలిపారు.
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈనెల 16న వ్యాజ్యాన్ని విచారనుందని స్పష్టం చేశారు జస్టిస్ ఎన్వీ రమణ. హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా తమను ఇబ్బంది పెట్టేదిగా ఉందంటూ వాపోయారు బాధిత కుటుంబాలు.
గత ఏడాది అక్టోబర్ 3న యూపీ డిప్యూటీ సీఎం మౌర్య టూర్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది చని పోయారు.