Goa Manipur CM’s : గోవా..మణిపూర్ సీఎంలుగా సావంత్..సింగ్
ప్రకటించిన భారతీయ జనతా పార్టీ హైకమాండ్
Goa Manipur CM’s : ఎవరు సీఎంలుగా ఉంటారనే దానిపై ఉత్కంఠకు తెర దించింది భారతీయ జనతా పార్టీ(Bharatiya Janta Party) అధినాయకత్వం. సుదీర్ఘ మంతనాల అనంతరం ఇవాళ ఢిల్లీ వేదికగా గోవా, మణిపూర్ (Manipur) రాష్ట్రాలకు సీఎంలుగా అభ్యర్థులను ప్రకటించింది.
ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే సీఎంలుగా కొనసాగుతున్న ప్రమాద్ సావంత్, ఎన్. బీరేన్ సింగ్(Goa Manipur CM’s) లకే మరోసారి పదవీ బాధ్యతలు అప్పగించింది.
దీంతో గోవా, మణిపూర్ (Manipur) లలో కొత్త సీఎంలు ఎంపికవుతారని వస్తున్న ప్రచారానికి తెర దించింది బీజేపీ హైకమాండ్. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janta Party) సత్తా చాటింది.
రెండో సారి తామే పవర్ లోకి వచ్చింది. హోలీ పండగ తర్వాత వీరి ప్రమాణ స్వీకారం ఉంటుందని స్పష్టం చేసింది పార్టీ. ఇదిలా ఉండగా ప్రమోద్ సావంత్ , బీరేన్ సింగ్ (Goa Manipur CM’s)లు ప్రత్యేకంగా ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీని కలిశారు.
ఇక ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది బీజేపీకి. ఆ రాష్ట్ర చరిత్రలో బీజేపీ కొత్త ఒరవడి సృష్టించింది. యోగి రెండోసారి సీఎంగా కొలువు తీరనున్నారు.
ఇక మణిపూర్ (Manipur) లో బీరేన్ సింగ్ కు పోటీగా బిశ్వజిత్ సింగ్ బలమైన పోటీదారుగా ఉన్నారు. ఆయనతో పాటు కోంతౌజం గోవిందాస్ సింగ్ పదవిని ఆశించారు. కానీ పార్టీ బీరేన్ సింగ్ కే ఛాన్స్ ఇచ్చింది.
గోవాలో సైతం ఉత్కంఠ నెలకొంది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే గవర్నర్ ను వ్యక్తిగతంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా గోవాలో జరిగిన ఎన్నికల్లో 40 స్థానాలకు గాను 20 సీట్లు గెలుచుకుంది బీజేపీ,
ఎంజీపీ, ఇండిపెండ్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మణిపూర్ (Manipur) లో 60 స్థానాలకు గాను బీజేపీ 32 సీట్లలో విజయ ఢంకా మోగించింది.
Also Read : పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ గుడ్ బై