Mamata Banerjee : దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికల పర్వం ముగిసింది. నాలుగు రాష్ట్రాలలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) సత్తా చాటింది. పంజాబ్ లో ఆప్ (AAP) కొలువు తీరింది. అయితే రాష్ట్రపతి ఎన్నికలు (Elections) జరగాల్సి ఉంది.
ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (Trinamool congress party) చీఫ్, పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee). ఈ ఎన్నికల్లో ఆమె యూపీలో సమాజ్ వాది పార్టీకి సపోర్ట్ చేసింది. గోవాలో పాగా వేయాలని చూసింది.
కానీ వర్కవుట్ కాలేదు. ఈ తరుణంలో గేమ్ ఇంకా పూర్తి కాలేదన్నారు. త్వరలో జరగబోయే ప్రెసిడెన్షియల్ పోల్ లో తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు మమతా బెనర్జీ (Mamata Banerjee) . రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడం అంత సులభం కాదని తెలుసు కోవాలన్నారు.
ఇక దేశ వ్యాప్తంగా మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో సగం కూడా లేనందు వల్ల విజయం సాధించడం చాలా కష్టమని స్పష్టం చేశారు మమతా బెనర్జీ (Mamata Banerjee) . తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.
సమాజ్ వాది పార్టీ యూపీలో ఇంకా బలంగానే ఉందన్నారు. కేవలం తక్కువ ఓటు బ్యాంకుతో చాలా సీట్లు కోల్పోవడం జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు (MLAs) ఎక్కువ మంది ఉన్నారని గుర్తు చేశారు సీఎం.
విపక్షాలకు చెందిన అభ్యర్థి గనుక పోటీలో ఉంటే బీజేపీ నుంచి విజయం సాధించడం చాలా కష్టమవుతుందన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి ఎన్నిక 1971లో రాష్ట్ర జనాభాను పరిగణలోకి తీసుకుని నిర్వహిస్తారు.
Also Read : గోవా..మణిపూర్ సీఎంలుగా సావంత్..సింగ్