Bhagwant Mann : పంజాబ్ సీఎంగా కొలువుతీరిన భగవంత్ మాన్ సంచలన నిర్ణయాలకు కేరాఫ్ గా మారారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కీలక కామెంట్స్ చేశారు.
ఇక నుంచి సీఎం (తన ఫోటో) ఫోటోతో పాటు ప్రధాని మోదీ ఫోటోలు ఉండవని స్పష్టం చేశారు. విప్లవ యోధుడు, దేశం గర్వించే త్యాగధనుడు భగత్ సింగ్ , భారత రాజ్యాంగ స్పూర్తి ప్రదాత బాబా సాహెబ్ అంబేద్కర్ లకు సంబంధించిన ఫోటోలు మాత్రమే ప్రభుత్వ ఆఫీసులలో ఉండాలని ఆదేశించారు.
భగత్ సింగ్ పుట్టిన ఊరు ఖట్కర్ కలాన్ లో ప్రమాణ స్వీకారం చేశాడు. రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం కాకుండా బయట చేయడంతోనే తాను ప్రజల మనిషినని చెప్పకనే చెప్పాడు.
తాను ఆఫీసులోకి ఎంటరైన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం భగవంత్ మాన్(Bhagwant Mann )రాష్ట్రంలో ఎవరు అవినీతి, అక్రమాలకు పాల్పడినా లేదా లంచం అడిగినా వెంటనే తనకు ఫోన్ చేయమని ప్రకటించాడు.
తాను ఆరాధ్య దైవంగా భావించే భగత్ సింగ్ వర్దంతి రోజు ఈనెల 23న అవినీతిని నిరోధించేందుకు అవినీతి నిరోధక హెల్ప్ లైన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు పంజాబ్ సీఎం.
ఇక నుంచి ఒక్క రోజు కూడా వృధా చేయనని స్పష్టం చేశారు. ఈ నంబర్ తన వ్యక్తిగత నంబర్ గా ఉంటుందన్నారు. ఆ నంబర్ కు ఆడియో, వీడియో ద్వారా వాట్సాప్ చేయాలని సూచించాడు.
నేను ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకం కాదన్నారు. ఏ ఉద్యోగిని బెదిరించడం లేదన్నారు. 99 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ పరులన్నాడు.
ఒక శాతం ఉంటే ఉండి వచ్చు. అవినీతి వ్యవస్థను ఆప్ మాత్రమే శుభ్రం చేయగలదన్నారు.
Also Read : ఆఫర్ ఇచ్చినా వద్దానన్న దీదీ