Bhagavad Gita : పిల్ల‌ల‌కు పాఠ్యాంశంగా భ‌గ‌వ‌ద్గీత

గుజ‌రాత్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం

Bhagavad Gita  : ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తున్న ఒకే ఒక్క గ్రంథం భ‌గ‌వ‌ద్గీత‌. అదో జీవ‌న విధానం. అదో స్పూర్తి ప్ర‌ప‌చ‌నం. నిత్యం ఎదుర‌య్యే స‌వాళ్లు, స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌టి ప‌రిష్కారం చూపించే సాధ‌నం.

కృష్ణుడు బోధించిన సార‌మే ఈ భ‌గ‌వద్గీత‌. తాజాగా పిల్ల‌ల‌కు సైతం దీనిలోని మాధుర్యాన్ని, సారాన్ని, నైతిక‌త‌ను, ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించేందుకు గాను భ‌గ‌వ‌ద్గీత‌ను సిల‌బ‌స్ లో చేర్చాల‌ని నిర్ణ‌యం తీసుకుంది గుజ‌రాత్ స‌ర్కార్.

ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల నుంచే దీనిని అమ‌లు చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా ఆరు నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సిల‌బ‌స్ లో భ‌గ‌వ‌ద్గీత‌ను చేరుస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

2022-23 విద్యా సంవ‌త్స‌రం నుంచే ఇది అమ‌లులోకి వ‌స్తుంద‌ని పేర్కొంది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన నూత‌న విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల‌లో నైతిక విలువ‌లు, ధ‌ర్మ బ‌ద్ద‌మైన ప్ర‌వ‌ర్త‌న‌ను పెంపొందించేందుకు గాను పాఠ్య ప్రణాళిక‌లో భ‌గ‌వ‌ద్గీత‌ను చేరుస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జీతూ వఘానీ(Bhagavad Gita )స్ప‌ష్టం చేశారు.

గుజ‌రాత్ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు స్వాగ‌తించాయి. జీవితంలో ఏది సాధించాల‌న్నా విలువ‌లే ప్ర‌ధాన‌మ‌ని వాటిని పెంపొందించేందుకు భ‌గ‌వ‌ద్గీత అద్భుమైన సాధ‌నంగా ఉప‌యోగ ప‌డుతుంద‌ని పేర్కొన్నాయి.

ఇందులో భాగంగా గుజ‌రాత్ స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని తాము స్వాగ‌తిస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. దేశ వ్యాప్తంగా దీనిని అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తే బావుంటుంద‌ని సూచించింది.

Also Read : జ‌గ‌న‌న్న భ‌రోసా విద్యా దీవెన ఆస‌రా

Leave A Reply

Your Email Id will not be published!