P Chidambaram : దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పునరాలోచనలో పడింది ఆ పార్టీ. ఇప్పటికే సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ప్రధానంగా గాంధీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
సుదీర్ఘమైన రాజకీయ చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన ఆ పార్టీ ఇప్పుడు మీనవేషాలు లెక్కిస్తోంది. ప్రస్తుతం పార్టీలో రెండు వర్గాలుగా చీలి పోయాయి.
ఓ వర్గం గాంధీ ఫ్యామిలీకి మద్దతు పలకగా ఇంకో వర్గం గాంధీ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అటు వైపు మల్లికార్జున్ ఖర్గే, చిదంబరం , మాణిక్యం ఠాగూర్ ఉండగా ఇటువైపు గులాం నబీ ఆజాద్ , మనీశ్ తివారీ, శశి థరూర్ , భూపీందర్ హూడా, తదితరులు ఉన్నారు.
ఈ తరుణంలో చిదంబరం (P Chidambaram)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ పార్టీ కలిసేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.
వీలైతే ఆమ్ ఆద్మీ పార్టీతో సమన్వయం చేసుకునేందుకు ఆలోచిస్తామన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమికి సోనియా గాంధీ ఫ్యామిలీ ఒక్కరే ఎందుకు బాధ్యత వహించాలని ఆయన ప్రశ్నించారు.
గ్రామ, మండల, బ్లాక్, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర నాయకత్వాలు పూర్తిగా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు చిదంబరం.
పార్టీ కీలక భేటీలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారని కానీ పార్టీ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.
బాధ్యతల నుంచి ఎవరూ తప్పించు కోలేరని పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం.
Also Read : ఓటమికి అందరం బాధ్యులం