Sanjay Raut : ఎంఐఎం ఓ రోగం అంటుకుంటే ప్ర‌మాదం

సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న కామెంట్స్

Sanjay Raut  : శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీపై నిప్పులు చెరుగుతూ వ‌స్తున్న రౌత్ అస‌దుద్దీన్ ఓవైసీ చీఫ్ గా ఉన్న ఎంఐఎంపై ఫైర్ అయ్యారు.

మ‌హారాష్ట్రలో ఉన్న త‌మ ప్ర‌భుత్వం ఏ పార్టీతో జ‌త క‌ట్టే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఎంఐఎంను ఆ పార్టీని రానివ్వ బోమని పేర్కొన్నారు. అలాంటి ఆలోచ‌న‌, అవ‌కాశం లేద‌న్నారు.

ఎంఐఎంతో పొత్తు అన్న‌ది లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఆ పార్టీతో స్నేహం ప్ర‌మాద‌మే. పొత్తు పెట్టు కోవ‌డం అంటే ఓ రోగాన్ని అంటు కోవ‌డ‌మేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సంజయ్ రౌత్(Sanjay Raut ).

ఇందులో భాగంగా ఔరంగాజేబు స‌మాధి ముందు మోక‌రిల్లే పార్టీతో తాము ఎందుకు పొత్తు పెట్టుకుంటామ‌ని ప్ర‌శ్నించారు శివ‌సేన ఎంపీ. శివ‌సేన‌కు ఓ ప్రాముఖ్య‌త ఉంది.

రాష్ట్రంలోనే కాదు దేశంలో సైతం త‌మ పార్టీకి భారీ ఫాలోయింగ్ కూడా ఉంద‌న్నారు. రాజ‌కీయాల‌లో ఓట్లు, సీట్లు అన్న దానిని బేస్ గా చేసుకొని బేరీజు వేయ‌డం చేయ‌మ‌ని చెప్పారు.

దాని గురించి ఆలోచించాలంటే త‌మ‌కు కంప‌రం పుట్టుకు వ‌స్తుంద‌ని సంజ‌య్ రౌత్(Sanjay Raut )ఎద్దేవా చేశారు. శివ‌సేన పార్టీ ఇప్పుడే కాదు భ‌విష్య‌త్తులో కూడా ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ ఆద‌ర్శాల‌ను అనుస‌రిస్తుంద‌ని చెప్పారు.

ఎంఐఎం ఓ రోగం అంటుకుంటే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రించారు సంజ‌య్ రౌత్. ఎంఐఎం పార్టీకి భార‌తీయ జ‌న‌తా పార్టీకి ర‌హ‌స్య ఒప్పందం ఉంద‌ని, యూపీ ఎన్నిక‌ల్లో అది మ‌రోసారి బ‌య‌ట ప‌డింద‌ని ఆరోపించారు.

ఎంఐఎం నేత ఇంతియాజ్ జ‌లీల్ చేసిన ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించారు.

Also Read : భేటీ అబ‌ద్దం క‌లిసే పోటీ చేస్తాం

Leave A Reply

Your Email Id will not be published!