Modi : జపాన్ తో బంధం బ‌లోపేతం

స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాని మోదీ

Modi : ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో శాంతి అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. జపాన్ తో బంధం మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఇండో జ‌పాన సంబంధాల‌లో పురోగతి అప‌రిమితంగా ఉంద‌ని పేర్కొన్నారు. జ‌పాన్ ప్ర‌ధాన మంత్రి పుమియో కిషిడా ఇవాళ ఇండియాలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం భార‌త్ కు వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాన మంత్రి మోదీతో(Modi) స‌మావేశం అయ్యారు. ఇందులో భాగంగా భార‌త దేశంలో జ‌పాన్ 42 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డిని ప్ర‌క‌టించ‌నున్నారు. 14వ ఇండో జ‌పాన్ వార్షిక శిక‌రాగ్ర స‌మావేశంలో వీరిద్ద‌రూ స‌మావేశం కానున్నారు.

పుమియో కిషిడాతో ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇరు దేశాల మ‌ధ్య ఆర్థిక‌, సాంస్కృతిక సంబంధాల‌ను పెంపొందించే మార్గాల‌పై ఇరువురు చ‌ర్చించారు.

ఇందులో భాగంగా 2018 లో జ‌రిగిన చివ‌రి శిఖ‌రాగ్ర స‌మావేశంలో పాల్గొన్న విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు ప్ర‌ధాని మోదీ(Modi). ప్ర‌ధానంగా రెండు దేశాలు క‌లిసి న‌డ‌వాల‌ని నిర్ణ‌యించాయి.

మోదీ..పుమియో కిషిడా క‌లిసి స‌మావేశ‌మైన విష‌యాన్ని విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్ఛీ వెల్ల‌డించారు. భార‌త దేశంలో ప్ర‌త్య‌క్ష పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ పీఎం ఆస‌క్తి చూపిస్తున్నార‌ని తెలిపారు.

ఈనెల 21న ఉక్రెయిన్ , ఇండో ఫ‌సిఫిక్ పై దాని ప్ర‌భావం గురించి చ‌ర్చించ‌నున్నారు ప్ర‌ధాన మంత్రి మోదీ. ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ సంక్షోభం మ‌ధ్య జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

జ‌పాన్ , ఇండియా క్వాడ్ కూట‌మిలో స‌భ్యులుగా ఉన్నాయి. వీటితో పాటు యూఎస్ఏ, ఆస్ట్రేలియా కూడా ఉండ‌డం విశేషం.

Also Read : ద్ర‌వ్యోల్బ‌ణం దేశానికి ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!