Masood Ahmed : నేత‌ల నిర్వాకం ఓట‌మికి కార‌ణం

ఆర్ఎల్డీ చీఫ్ మ‌సూద్ గుడ్ బై

Masood Ahmed : రాష్ట్రీయ లోక్ ద‌ళ్ యూపీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ మ‌సూద్ అహ్మ‌ద్(Masood Ahmed) గుడ్ బై చెప్పారు. తాను పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

నేత‌ల నిర్వాకం, ఒంటెద్దు పోక‌డ వ‌ల్లే తాము తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా స‌మాజ్ వాది పార్టీ, రాష్ట్రీయ లోక్ ద‌ళ్ – ఆర్ఎల్డీ క‌లిసి సంయుక్తంగా బ‌రిలో దిగాయి.

రాష్ట్రంలో జాట్స్ ఓటు బ్యాంకు క‌లిగిన పార్టీగా పేరుంది. ఊహించ‌ని రీతిలో బీజేపీ 273 సీట్లు చేజిక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు ద‌క్క‌గా, బీఎస్పీకి ఒక్క సీటు ల‌భించింది.

ఈ త‌రుణంలో ఎస్పీ, ఆర్ఎల్డీ క‌లిసి పోటి చేసిన స్థానాల‌లో కాషాయం రెప రెప లాడింది. త‌మ పార్టీల నాయ‌కులు అఖిలేష్ యాద‌వ్ , జ‌యంత్ చౌద‌రిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మ‌సూద్ అహ్మ‌ద్(Masood Ahmed).

వీరిద్ద‌రి నిర్వాకం కార‌ణంగా తాము ఓట‌మి పాల‌య్యామ‌ని, త‌మ అభ్య‌ర్థుల‌ను స‌క్ర‌మంగా ఎంపిక చేయ‌లేదంటూ మండిప‌డ్డారు.

ఎన్నిక‌ల్లో వివిధ స్థానాల‌కు సంబంధించి టికెట్లు ఇచ్చేందుకు డ‌బ్బులు తీసుకున్నార‌ని, ఒక‌ర‌కంగా అమ్ముకున్నారంటూ ఫైర్ అయ్యారు మ‌సూద్ అహ్మ‌ద్.

ద‌ళితులు, పేద‌లు, మైనార్టీల స‌మ‌స్య‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించు కోలేద‌ని, వారిని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్లే తాము గెల‌వాల్సిన సీట్ల‌ను పోగొట్టు కోవాల్సి వ‌చ్చింద‌న్నారు.

బీజేపీపై యుద్దం చేయాల్సిన పార్టీలు సీట్ల కోసం త‌మ‌పై తాము పోరాటం చేశాయంటూ ఎద్దేవా చేశారు.

Also Read : జపాన్ తో బంధం బ‌లోపేతం

Leave A Reply

Your Email Id will not be published!