Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దూకుడు పెంచారు. కొత్త కేబినెట్ లో కేవలం 10 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా కొలువు తీరిన వెంటనే ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు.
ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడినా లేదా లంచం అడిగినా వెంటనే తనకు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా వీడియో, మెస్సేజ్ చేయాలని ప్రకటించాడు. యాంటీ కరప్షన్ టోల్ ఫ్రీ నెంబర్ ను ఈనెల షహీద్ భగత్ సింగ్ వర్దంతి 23న ప్రారంభిస్తామని తెలిపాడు.
కొత్తగా కొలువు తీరిన మంత్రులతో సమావేశం అయ్యారు సీఎం. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. వస్తూనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు భగవంత్ మాన్.
వీటిలో 10 వేల పోస్టులను పోలీసు శాఖలో భర్తీ చేస్తామని మిగతా 15 వేల పోస్టులను వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు సీఎం.
ఇక ప్రతి మంత్రికి వస్తూనే టార్గెట్ విధించారు. ఇక ఎన్నికైన ఎమ్మెల్యేలు రాజధాని ఛండీగఢ్ లో ఉండవద్దని వారు ఎన్నికైన నియోజకవర్గాలలో ఉండాలని ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాలలో తన ఫోటోతో పాటు పీఎం మోదీ ఫోటో కూడా ఉండ కూడదని తెలిపాడు. వాటి స్థానాల్లో భగత్ సింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోలు ఉంచాలని స్పష్టం చేశాడు భగవంత్ మాన్(Bhagwant Mann ).
ఇవాళ ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
Also Read : జపాన్ తో బంధం బలోపేతం