Marri Shashidhar Reddy : పార్టీకి విధేయులం వ్య‌తిరేకం కాదు

కాంగ్రెస్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి

Marri Shashidhar Reddy  : ఏఐసీసీలో జీ23 ర‌గ‌డ ముగిసిన వెంట‌నే జీ10 తెలంగాణ‌లో స్టార్ట్ అయ్యింది. రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వం పై కొంత కాలం అసంతృప్తితో ఉన్న వారంతా ఒక చోటుకు చేరారు. ఇటీవ‌ల మర్రి శ‌శిధ‌ర్ రెడ్డి (Marri Shashidhar Reddy )నివాసంలో భేటీ అయ్యారు.

తాజాగా హైద‌రాబాద్ లోని అశోక హోట‌ల్ లో ప్ర‌త్యేక భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ స‌మావేశానికి సీనియ‌ర్ నాయ‌కులు వి. హ‌నుమంత్ రావు, మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి, జ‌గ్గారెడ్డి, త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

మీటింగ్ ముగిసిన అనంత‌రం శ‌శిధ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము పార్టీకి విధేయుల‌మ‌ని వ్య‌తిరేకులం కామ‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో పార్టీ ప‌లు చోట్ల ఓడి పోయింద‌ని దానికి గ‌ల కార‌ణాల‌ను వెత‌కాల‌ని, సీనియ‌ర్ల‌ను , పార్టీ కోసం ముందు నుంచి క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వారిని క‌లుపుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు.

ఈ సంద‌ర్భంగా వ్య‌క్తిగ‌త క‌ల‌హాల‌తో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారాన్ని పోగొట్టుకుంద‌ని ఆ ప‌రిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాకూడ‌ద‌ని శ‌శిధ‌ర్ రెడ్డి (Marri Shashidhar Reddy )చెప్పారు.

జ‌యంతులు, వ‌ర్ధంతులు చేయ‌డం వ‌ల్ల నివాళులు అర్పించ‌డం వ‌ల్ల ఒన‌గూరేది ఏమీ ఉండ‌ద‌న్నారు. వారు ఎలా పార్టీకి సేవ చేశార‌నే దానిని స్పూర్తిగా తీసుకోవాల‌ని సూచించారు.

తమ‌కు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంపై పూర్తి విశ్వాసం ఉందని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి. హై క‌మాండ్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా పార్టీ బ‌లోపేతం కోస‌మేన‌ని చెప్పారు.

రాబోయే ఎన్నిక‌లు పార్టీ మ‌నుగ‌డ కోసం కీల‌క‌మ‌న్నారు. తాము ఇప్పుడు క‌లుసుకోలేద‌ని ప్ర‌తిసారి క‌లుసుకుంటూనే ఉన్నామ‌ని చెప్పారు. హుజూరాబాద్ ప‌రిస్థితి రాష్ట్రంలో రాకూడ‌ద‌న్న‌దే త‌మ తాప‌త్ర‌య‌మ‌న్నారు.

Also Read : ముగిసిన స‌మావేశం మోదీపై యుద్ధం

Leave A Reply

Your Email Id will not be published!