Sharad Yadav : భారత దేశ రాజకీయాలో వారిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. ఒకరు శరద్ పవార్ మరొకరు లాలూ ప్రసాద్ యాదవ్. 25 సంవత్సరాల తర్వాత తాను స్థాపించిన లోక్ తాంత్రిక్ జనతాదళ్ ను విలీనం చేశారు.
ఇవాళ శరద్ యాదవ్(Sharad Yadav) ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తో భేటీ అయ్యారు. దీంతో బీహార్ రాష్ట్ర రాజకీయాలలో అనూహ్యమైన పరిణామం అని చెప్పక తప్పదు.
ఇటీవల తన పార్టీని విలీనం చేయబోతున్నట్లు ప్రకటించారు శరద్ యాదవ్. ఇక లాలూ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. శరద్ యాదవ్ ప్రస్తుతం యాక్టివ్ గా లేరు పాలిటిక్స్ లో.
తన ఆలోచనలు, అభిప్రాయాలతో దగ్గరగా ఉన్న లాలూ నేతృత్వంలోని ఆర్జేడీలో పార్టీని విలీనం చేయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. విపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా శరద్ యాదవ్(Sharad Yadav).
కేంద్రంలోని బీజేపీని ఓడించేందుకు మనందరం ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. మొదటగా విపక్షాలన్నీ ఏకం కావాలని ఆ తర్వాత ఎవరు లీడ్ చేస్తారన్నది తర్వాత ఆలోచిస్తామన్నారు.
బీహార్ రాజకీయాలను ఈ ఇద్దరు నేతలు కొన్నేళ్ల పాటు శాసించారు. అయితే రాజీకీయంగా వీరిద్దరూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
1997లో జనతాదళ్ ను వీడి రాష్ట్రీయ జనతా దళ్ పార్టీని ఏర్పాటు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్. ప్రస్తుత సీఎం నితీశ్ తో కలిసి చాలా సార్లు జర్నీ చేశారు శరద్ యాదవ్. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు.
Also Read : కర్ణాటక జడ్జీలకు ‘వై’ కేటగిరి భద్రత