AP Assembly : పెగాస‌స్ పై చ‌ర్చ ర‌చ్చ ర‌చ్చ

దీదీ చేసిన కామెంట్స్ ప్ర‌స్తావ‌న

AP Assembly : ఏపీ అసెంబ్లీలో పెగాసస్ స్పైవేర్ వ్య‌వ‌హారం కుదిపేసింది. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ బాంబు పేల్చింది. ఆనాడు ఏపీ సీఎంగా ఉన్న టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు స్పైవేర్ ను కొనుగోలు చేశారంటూ ఆరోపించింది.

ప్ర‌స్తుతం దీనిపైనే ర‌గ‌డ మొద‌లైంది. ఇక ఇవాళ స‌భా మ‌ర్యాద‌ల‌కు ఆటంంకం క‌లిగిస్తున్నారంటూ స్పీక‌ర్ టీడీపీ స‌భ్యుల‌పై ఫైర్ అయ్యారు. ఎంత‌కూ వినిపించుకోక పోవ‌డంతో ఒక రోజు స‌స్పెన్ష‌న్ విధించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్ర‌సంగించారు. స‌భ‌లో పెగాస‌స్ స్పైవేర్ పై చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. స్పైవేర్ కొనాల‌ని తమ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లు ఆనాటి ఐటీ మినిష్ట‌ర్ నారా లోకేష్ చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు.

ఇప్ప‌టికే ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారిస్తోంద‌ని, ఇందుకు సంబంధించి విచార‌ణ‌కు క‌మిటీ ఏర్పాటు చేసింద‌న్నారు మంత్రి. దీనిని ఎవ‌రు కొనుగోలు చేశారు. ఎందుకు తీసుకున్నారు.

ఎలా వినియోగించార‌నేది తేల్చాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వ విప్ శ్రీ‌కాంత్ రెడ్డి పెగాస‌స్ (AP Assembly)పై చ‌ర్చ‌కు నోటీసు ఇచ్చారు. స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌కు అనుమ‌తి ఇస్తామ‌ని స్పీక‌ర్ వెల్ల‌డించారు.

దీనిపై స్పందించారు ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి. పెగాస‌స్ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియ‌స్ గా తీసుకుంద‌ని చెప్పారు. చంద్ర‌బాబు హ‌యాంలోనే పెగాస‌స్ వాడ‌రంటూ బెంగాల్ సీఎం దీదీ చెప్పార‌ని తెలిపారు.

దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసే అవ‌కాశం ఉంద‌ని ఆరోపించారు.

Also Read : ప్ర‌జా ప్ర‌తినిధుల బంధుగ‌ణానికి క‌మిష‌నర్ చెక్‌

Leave A Reply

Your Email Id will not be published!