TS GOVT JOBS : తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించిన 80 వేల 39 పోస్టులకు గాను మొదటగా 30 వేల 453 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది.
బుధవారం శాఖల వారీగా ఉద్యోగా నియామకాలకు సంబంధించి పర్మిషన్ ఇస్తూ జీఓలు రిలీజ్ చేసింది.
దీనిపై సమీక్షించి వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఆ మేరకు ఆర్థిక శాఖ మంత్రి , ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
ఇందులో భాగంగా ఇప్పటికే మంత్రులు, సంబంధిత శాఖల హెడ్స్ చర్చించారు. వీరితో పాటు సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నారు.
ప్రస్తుతానికి గాను 30 వేల 453 పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఇక జారీ చేసిన పోస్టులకు సంబంధించి గ్రూప్ -1, హోం శాఖ, జైళ్లు, రవాణా శాఖ, వైద్య ఆరోగ్య శాఖల్లోని పోస్టులకు ఛాన్స్ ఇచ్చింది.
అంతే కాకుండా టెట్ కూడా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత శాఖల్లో భర్తీ ప్రక్రియను (TS GOVT JOBS)నియామక సంస్థలు చేపడతాయి.
ఇక మిగిలిన శాఖలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ -1 పోస్టులు 503, పోలీస్ శాఖలో 16,587 పోస్టులు పోలీస్ శాఖ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్న 154 పోస్టులను పోలీసు బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.
31 పోస్టులను జైళ్ల శాఖకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేస్తారు. రవాణా శాఖలో స్వంత బోర్డు ద్వారా 149 పోస్టులు ,
మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో 10 వేల 028 పోస్టులు మెడికల్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. 2, 662 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కు సంబంధించి భర్తీ చేయనున్నారు.
Also Read : తెలంగాణలో శాఖల వారీగా పోస్లులు ఇవే