KTR : దేశంలోనే ఐటీ పరంగా తెలంగాణ రాష్ట్రం టాప్ లో ఉందన్నారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ సారథ్యంలో స్టార్టప్ లో సైతం నెంబర్ వన్ స్టేట్ గా నిలిచిందన్నారు.
పది రోజుల టూర్ లో భాగంగా అమెరికాలో ఐటీ సెర్వ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్(KTR) ప్రసంగించారు. ఇందులో సంస్థ సభ్యులు 250 మంది పాల్గొన్నారు.
తెలంగాణలో ఐటీ పెట్టుబడులపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక ఐటీ సెర్వ్ ఐటీ స్టాఫింగ్ అండ్ సర్వీసెస్ సెక్టార్ లో 1400 మంది సభ్యుల కంపెనీలతో కూడిన లాభా పేక్ష లేని సంస్థ.
అమెరికాలోని 22 రాష్ట్రాలలో ఇది విస్తరించి ఉంది. సభ్య కంపెనీల మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లు . లక్ష మంది నైపుణ్యం కలిగిన ఐటీ ఎక్స్ పర్ట్స్ కు ఉపాధి అవకాశం కల్పిస్తోంది.
ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడేళ్లలో తెలంగాణ అనూహ్యంగా అన్ని రంగాలలో అభివృద్ది చెందిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ లోటు, నీటి కొరత లేకుండా చేశామన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో టీఎస్ ఐఎస్ పాలసీని తీసుకు వచ్చామని చెప్పారు మంత్రి కేటీఆర్(KTR). హైదరాబాద్ నగరంపై భారాన్ని తగ్గించేందుకు గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీని తీసుకు వచ్చామన్నారు.
అంతే కాకుండా టైర్ -2 నగరాల్లో కూడా ఐటీని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్ , ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్ నగర్ లలో ఐటీ టవర్లు రానున్నాయని తెలిపారు.
Also Read : వాహనదారులకు బిగ్ షాక్