KCR : సీఎం కేసీఆర్ రూటే సపరేటు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరూ చెప్పలేరు. ఎన్నో ఏళ్లుగా బీజేపీలో ఉంటూ టీఆర్ఎస్ లో చేరిన శ్రీధర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు.
కాంగ్రెస్ నుంచి కాదని పార్టీ మొదటి నుంచి పని చేస్తూ వచ్చిన ఇంతియాజ్ కు కార్పొరేషన్ పోస్టు కట్టబెట్టారు. రోడ్ల అభివృద్ది సంస్థ చైర్మన్ గా శ్రీనివాస్ కు చైర్మన్ పదవి ఇచ్చారు కేసీఆర్.
సారు అనుకోని షాక్ ఇస్తారు. ఆపై విస్తు పోయేలా చేస్తారు. సీఎం(KCR )ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పలు కార్పొరేషన్లకు పదవులు కట్టబెట్టారు.
తాజాగా మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా రావుల శ్రీధర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.
రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మెట్టు శ్రీనివాస్ ను, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇంతియాజ్ ఇషాక్ ను అపాయింట్ చేశారు. రెండు సంవత్సరాల పాటు వీరు ఈ పదవుల్లో కొనసాగుతారని సీఎస్ వెల్లడించారు.
సంబంధిత శాఖలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రావుల శ్రీధర్ రెడ్డి ది వరంగల్ జిల్లా. ఆయనకు పలు అంశాలపై మంచి పట్టుంది. విద్యావంతుడిగా పేరొందారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో తన జాబ్ కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీలో చేరారు. 2020లో టీఆర్ఎస్(KCR )తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ కు చైర్మన్ గా ఉన్నారు.
మెట్టు శ్రీనివాస్ కూడా వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇక ఇంతియాజ్ ఇషాక్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నాయకుడు. ఇక్కడ మైనార్టీ వర్గానికి సంబంధించి మొట్ట మొదటిగా జెండాను పట్టుకున్నది మాత్రం హనీఫ్ అహ్మద్.
Also Read : తెలంగాణలో విద్యుత్ ఛార్జీల షాక్