Piyush Goyal : సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) . ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని కావాలనే కేసీఆర్ రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపించారు.
ఆయన చేస్తున్నదంతా ఓ నాటకం అంటూ కొట్టి పారేశారు. పాలన చేతకాక తమపై ఆరోపణలు చేస్తే జనం నమ్మరన్నారు. సీఎంతో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులంతా అబద్దాలు చెబుతున్నారని, వారి చేతకాని తనాన్ని తమ మీదదకు నెట్టి వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
వారు చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయిందన్నారు గోయల్(Piyush Goyal). ధాన్యం కొనుగోలు విషయంలో తాము ఎవరి పట్లా వివక్ష చూపించడం లేదని స్పష్టం చేశారు.
ఇలాంటి చవకబారు ఆరోపణలు ఇక నుంచి మాను కోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల తరహా లోనే తాము తెలంగాణ రాష్ట్రం నుంచి ముడి (రా) బియ్యాన్ని సేకరిస్తున్నామని చెప్పారు.
పంజాబ్ కు ఎలాంటి విధానం ఉంటుందో తెలంగాణకు అదే పాలసీ అమలవుతోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రా రైస్ ఎంత ఇష్టామనే విషయాన్ని ఈరోజు వరకు తెలంగాణ సర్కార్ వివరాలు తమకు తెలియ చేయలేదని మండిపడ్డారు.
ఈ సమయంలో ఇలాంటి నిరాధారణమైన ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని సూచించారు పీయూష్ గోయల్. అంతే కాకుండా బాంబు పేల్చారు.
గత నెల 22, మార్చి 8న సమావేశాలకు రావాలని ఆహ్వానించినా రాలేదని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారంటూ ధ్వజమెత్తారు గోయల్.
Also Read : మోదీని కలిసిన సీఎం భగవంత్ మాన్