Bandi Sanjay : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచడంపై ఆయన కన్నెర్ర చేశారు. టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ కు పోయే కాలం వచ్చిందంటూ ఆరోపణలు చేశారు.
కరోనా తో నానా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి కరెంట్ ఛార్జీలు వడ్డించడం దారుణమన్నారు. రాబోయే కాలంలో సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇవ్వడం ఖాయమన్నారు.
ఈ భారం పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలపై ఎక్కువ పడుతుందన్నారు. రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ. 6 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్(Bandi Sanjay).
ఇవాళ బండి సంజయ్ కుమార్ బహిరంగ ప్రకటన చేశారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్దమంటూ మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్ ఏం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు.
ఈరోజు వరకు డిస్కంలకు చెల్లించాల్సిన రూ. 48 వేల కోట్లు బకాయిలు చెల్లించక పోవడంపై మండిపడ్డారు బండి సంజయ్(Bandi Sanjay).
ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలే రూ. 12 వేల కోట్లకు పైగా ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ. 5 వేల 603 కోట్లు కాగా అత్యధికంగా పాతబస్తీకి చెందినవే ఉన్నాయంటూ ధ్వజమెత్తారు బండి సంజయ్.
ప్రభుత్వ ఆధీనంలోని శాఖలు కట్టకుండా మొండికేస్తుంటే సర్కార్ ఏం చేస్తోందంటూ నిలదీశారు. సామాన్యులపై భారం మోపడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
ప్రభుత్వం పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
Also Read : ఆ ముగ్గురికి కీలక పోస్టులు