Kashmir Files : దేశ రాజకీయాలను శాసించే యూపీ రాష్ట్రంలో అనూహ్యంగా రెండోసారి భారతీయ జనతా పార్టీ పవర్ లోకి వచ్చింది. ఊహించని రీతిలో యోగి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 317 సీట్లు రాగా తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ సంఖ్య తగ్గింది.
అనూహ్యంగా సమాజ్ వాది పార్టీ 47 సీట్ల నుంచి 111 సీట్లకు చేరింది. కూటమితో కలిపి 125 సీట్లు వచ్చాయి.
ఇప్పటికే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ , మణిపూర్,
గోవా రాష్ట్రాలలో రెండో సారి బీజేపీ పవర్ లోకి వచ్చింది. ఇక పంజాబ్ లో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ తన పట్టు కోల్పోయింది.
అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 117 సీట్లకు గాను 92 సీట్లు చేజిక్కించుకుని సత్తా చాటింది. ఈ మేరకు గోవాకు ప్రమాద్ సావత్
సీఎంగా కొలువు తీరగా, మణిపూర్ లో ఎన్. బీరేన్ సింగ్ , ఉత్తరాఖండ్ లో పుష్కర్ సింగ్ ధామీలకే మరోసారి ఛాన్స్ ఇచ్చింది.
ఇక యూపీలో పూర్తిగా యోగి హవా నడుస్తోంది. అక్కడ ఆయన చెప్పిందే వేదం. ఇక్కడ మోదీ త్రయం మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా కొలువు తీరింది.
తమ సత్తా చాటారు వీరంతా. ప్రత్యేకించి ప్రధాని ఇక్కడే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
యోగీ ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈనెల 25న శుక్రవారం ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యకరమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా, మరికొందరు బీజేపీ నేతలు హాజరు కానున్నారు.
అంతే కాదు ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ , బోనీ కపూర్ లకు సైతం ఆహ్వానం అందింది.
విచిత్రం ఏమిటంటే ఇటీవలే విడుదలై రూ. 200 కోట్లకు పైగా వసూలు సాధించిన ది కాశ్మీర్ ఫైల్స్(Kashmir Files) టీంకు కూడా యోగి ఆహ్వానం పలకడం విశేషం.
Also Read : కేసీఆర్ నాటకం కావాలనే దుష్ప్రచారం