YS Jagan : రాజ‌ధానిపై తుది నిర్ణ‌యం రాష్ట్రానిదే

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

YS Jagan : ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) మ‌రోసారి మూడు రాజ‌ధానుల‌పై త‌న ప‌ట్టు వీడ‌డం లేదు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చే ప్ర‌యత్నం చేశారు. అయితే తాము న్యాయ వ్య‌వ‌స్థ‌ను ధిక్క‌రించ‌డం లేద‌న్నారు.

వికేంద్రీక‌ర‌ణే త‌మ విధాన‌మ‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ రెడ్డి(YS Jagan). ఇదే స‌మ‌యంలో చ‌ట్ట స‌భ‌ల గౌర‌వాన్ని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంటుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా రాజ‌ధానుల ఏర్పాటు విష‌యంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు శాస‌న‌స‌భ హ‌క్కులు హ‌రించేలా ఉంద‌న్నారు సీఎం.

రాజ‌ధాని ఏర్పాటుపై తుది నిర్ణ‌యం రాష్ట్రానికే ఉంటుంద‌ని కేంద్ర స‌ర్కార్ స్ప‌ష్టం చేసింద‌ని, ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

వ్య‌వ‌స్థలు త‌మ ప‌రిధులు దాటితే కుప్ప కూలి పోయే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని హెచ్చ‌రించారు. గ‌తంలో కొలువు తీరిన పాల‌కుల ప‌నితీరు, పాల‌నా ప‌ద్ద‌తులు న‌చ్చ‌క‌నే త‌మ‌కు అధికారాన్ని క‌ట్ట బెట్టార‌ని చెప్పారు సీఎం(YS Jagan).

చ‌ట్ట స‌భ‌ల రాజ్యాంగ హ‌క్కును కాపాడాల్సిన బాధ్య‌త ఇరువురిపై ఉంద‌న్నారు. రాష్ట్రం అన్నాక అభివృద్ధి ఫ‌లాలు అంద‌రికీ, అన్ని ప్రాంతాల‌కు స‌మానంగా వ‌ర్తించేలా చూడాల‌న్నారు.

ఇది పూర్తిగా త‌మ‌పై ఉంటుంద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో అమ‌రావ‌తికి భూములు ఇచ్చిన రైతుల‌ను తాము కాపాడుతామ‌ని ప్ర‌క‌టించారు స‌భ‌లో.

ఎవ‌రో చెబితేనో తాము ప‌వ‌ర్ లోకి రాలేద‌ని, ప్ర‌జ‌లు ఓట్లు వేస్తే అఖండ విజ‌యాన్ని క‌ట్ట బెడితే అధికారంలోకి వ‌చ్చామ‌న్నారు. న్యాయ‌, శాస‌న‌, కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థలు క‌లిసి సాగాల‌ని కానీ జోక్యం చేసుకుంటే పాల‌నా ప‌రంగా ఇబ్బందులు ఏర్ప‌డుతాయ‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి.

Also Read : పాల‌నా వికేంద్రీక‌ర‌ణ కేబినెట్‌ నుంచి ఆరంభిస్తే పోలా…

Leave A Reply

Your Email Id will not be published!