Calcutta High Court : పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న హింసాకాండ దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. తాజాగా ఈ ఘటనపై హైకోర్టు స్పందించింది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఈ ఘటనలో 8 మంది సజీవ దహనం అయ్యారు. బీర్బూమ్ కేసు దర్యాప్తును కేంద్ర ఏజెన్సీకి అప్పగించ వద్దంటూ సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తిరస్కరించింది కోర్టు.
కలకత్తా హైకోర్టు కేసును(Calcutta High Court )సీబీఐకి బదిలీ చేసింది. చని పోయిన ఎనిమిది మందిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. వీరంతా సజీవ దహనం కావడం పలు అనుమానాలకు తావిచ్చింది.
దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. విచారణకు ఆదేశించాలంటూ డిమాండ్ చేశాయి. భీర్ భూమ్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వెంటనే టేకోవర్ చేయాలంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (The Central Bureau of Investigation) కు సూచించింది.
దర్యాప్తను కేంద్ర ఏజెన్సీకి వద్దనే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది ఈ సందర్భంగా కోర్టు. దీంతో బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం – సిట్ ఈ కేసును సీబీఐకి అప్పగించనుంది.
కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్ భరద్వాజ్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఏప్రీల్ 7వ తేదీ లోగా పురోగతి నివేదికను సమర్పించాలని సీబీఐకి సూచించింది.
ఇదిలా ఉండగా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ టీం నేర స్థలానికి చేరుకుని నమూనాలు, ఆధారాలు సేకరిస్తోంది.
Also Read : ‘కశ్మీర్ ఫైల్స్ టీం’కు యోగి ఆహ్వానం