Jai Shankar : చైనాతో చర్చలు ప్రస్తుతానికి ఆశాజనకంగా జరిగాయని స్పష్టం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. ఇవాళ చైనాకు చెందిన విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో భేటీ అయ్యారు.
దాదాపు మూడు గంటలకు పైగా చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకునే ఇండియా, చైనా అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు.
నిన్న సాయంత్రం వాంగ్ యీ భారత్ లో పర్యటన నిమిత్తం వచ్చారు. తన పర్యటనలో ఉన్న ఆయన ప్రత్యేకించి భారత దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశం అయ్యారు. అనంతరం జై శంకర్(Jai Shankar) తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అజిత్ దోవల్ ను చైనాకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ. గతంలో కంటే ఇప్పుడు పరిణామాలలో మార్పు చోటు చేసుకుందన్నారు.
వాంగ్ యీ తో సుదర్ఘ సమావేశం అనంతరం జై శంకర్(Jai Shankar) మీడియాతో మాట్లాడారు. దేశ సరిహద్దు వద్ద చైనా చర్యలతో చెదిరిన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు సాగాయని వెల్లడించారు.
కాగా లడఖ్ లో ఇప్పటికీ ఘర్షణ వాతావరణం నెలకొందని దీని గురించి తాము ప్రత్యేకంగా ప్రస్తావించామని తెలిపారు. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ఆసక్తితో తాము సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నామని చెప్పారు జై శంకర్.
Also Read : కశ్మీర్ ఫైల్స్ కు మోదీ ప్రచారం