Uddhav Thackeray Modi : (Maharashtra CM) మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే (CM Uddhav Thackeray) సంచలన కామెంట్స్ చేశారు(sensational comments). ఆయన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కావాలని బీజేపీయేతర ప్రభుత్వాలను టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
తన బావమరిదికి చెందిన రూ. 6.45 కోట్ల ఆస్తులను జప్తు చేసింది ఈడీ. నాతో పెట్టుకోవాలని అనుకుంటే ఓకే. నేను సిద్దంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. నన్ను జైల్లో ఉంచాలని అనుకుంటే అందుకు సిద్దంగా ఉన్నానని అన్నారు.
ప్రభుత్వ సంస్థలను గంపగుత్తగా అమ్మకానికి పెట్టిన కేంద్ర సర్కార్ మరో వైపు కావాలని తమకు ఎదురు తిరిగిన వాళ్లను, ప్రశ్నించే వాళ్లను కావాలని వేధింపులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray ).
దేశాన్ని కాషీయీకరణ చేయాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. అయితే కాషాయ నేతలను తాము ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదన్నారు.
ఒక వేళ తమను చెరసాలలో పెట్టాలని అనుకుంటే రండి దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఇద్దరిని కావాలని అదుపులోకి తీసుకున్నారని ఇంకెంత మందిని అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారో ఒక లిస్టు చెబితే రెడీ గా ఉన్నామన్నారు.
ఇక దావూద్ ఇబ్రహీం ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. పోనీ మీకు తెలిస్తే..లేదా మీకు దమ్ముంటే దావూద్ ను అరెస్ట్ చేసి చంపగలరా అని సవాల్ విసిరారు.
గతంలో బీజేపీ రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని, ఇప్పుడు దావూద్ ఇబ్రహీంను అడ్డం పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
Also Read : చైనాతో చర్చలు ఆశాజనం