KTR : పది రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ (KTR)కు అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, తీసుకుంటున్న చర్యలు, పెట్టుబడిదారులకు ఎలా సపోర్ట్ చేస్తున్నామనే దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రధానంగా టీఎస్ సర్కార్ తీసుకు వచ్చిన టీఎస్ ఐపాస్ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. దీని వల్ల కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. విద్యుత్, నీటి, రవాణా వసతి సౌకర్యాలను అందజేస్తున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో కేటీఆర్ తో మైక్రోసాఫ్ట్ కు చెందిన ఎండీ ( పరిశ్రమ పరిశోధన ) , సిటీఓ అగ్రి ఫ/డ్ శ్రీరణ్ వీర్ చంద్ర సమావేశం అయ్యారు.
తెలంగాణలో వ్యవసాయ రంగంలో డేటా ప్లాట్ ఫారమ్ లు, కనెక్టివిటీ, రోబోటిక్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వంటి అధునాతన సాంకేతికతలను అమలు చేయడం గురించి చర్చించారు.
ఇదిలా ఉండగా న్యూ జెర్సీ లోని ఎడిషన్ టౌన్ షిప్ లో మన ఊరు మన బడి ఎన్ఆర్ఐ పోర్టల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యా యజ్ఞానికి తెలంగాణ ప్రవాసులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు వాటి రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని అన్నారు కేటీఆర్. ఇందు కోసం రూ. 7.300 కోట్లు కేటాయించారని వెల్లడించారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో మన రాష్ట్ర జీడీపీ పెరిగిందన్నారు. తమ ఊరు కోసం ఎన్నారైలు సాయం చేయాలన్నారు.
Also Read : మీ వాహనంపై ఆ స్టిక్కర్ పడితే… కార్డు చూపాల్సిందే