Yadagirigutta : సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేసిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Yadagirigutta) ఆలయం పునర్ వైభవాన్ని సంతరించుకుంది. భారీ ఎత్తున అలరిస్తోంది.
అచ్చం తిరుపతిని పోలిన విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈనెల 28 నుంచి ఇక సామాన్య భక్తులకు దర్శనం కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఆలయ కమిటీ.
ఇక తిరుపతి తరహాలో పాలకమండలి నియమించాలని భావిస్తోంది టీఆర్ఎస్ సర్కార్. ఇదిలా ఉండగా తిరుమల తరహాలోనే స్వామి వారిని దర్శించుకునేందుకు గాను బ్రేక్ దర్శనాలు, ఆన్ లైన్ లో దర్శనాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు యాదగిరిగుట్ట ఇఓ గీత.
సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 11. 55 గంటలకు యాదగిరిగుట్ట ప్రధాన ఆలయాన్ని పునః ప్రారంభిస్తారని వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం(Yadagirigutta) కల్పిస్తామని తెలిపారు.
యాదాద్రి కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించ బోమని స్పష్టం చేశారు. ఇక దర్శనం కోసం వచ్చే కొండ కింద యాగశాల ప్రాంగణంలోని పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపి వేయాలన్నారు.
అక్కడి నుంచి దేవాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుల్లో కొండ పైకి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరారు ఈవో .ప్రతి భక్తుడికి క్యూ ఆర్ కోడ్ ఇస్తామన్నారు తెలిపారు.
భక్తులు క్యూ కాంప్లెక్స్ నుంచే స్వామి వారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో సాగాయి పనులు.
Also Read : 28 నుంచి అన్నమాచార్య 519వ వర్థంతి