Birbhum Violence : ‘బీర్బూమ్’ ఘటనలో సీబీఐ పురోగతి
21 మంది నిందితులు టీఎంసీ నేత అరెస్ట్ కు సిద్దం
Birbhum Violence : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ (Birbhum Violence)మారణకాండలో ఇప్పటి వరకు 21 మంది నిందితులను గుర్తించినట్లు బాంబు పేల్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.
కేంద్ర దర్యాప్తు సంస్థతో కాకుండా సిట్ తో దర్యాప్తు చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కోల్ కతా కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర సర్కార్ పిటిషన్ ను కొట్టి వేస్తూ కేసును సీబీఐకి బదలాయించింది.
దీంతో రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ పూర్తి వివరాలను సీబీఐకి విన్నవించింది. ఇదిలా ఉండగా సీబీఐ రంగంలోకి దిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నిందితులను గుర్తించినట్లు తెలిపింది.
ఇందులో తృణమూల్ కాంగ్రెస పార్టీకి చెందిన నాయకుడు ఒకరి ప్రమేయం కూడా ఉందని ఆరోపించింది. రాంపూర్ హాట్ లోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో సీబీఐ బృందం తాత్కాలిక శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
సీనియర్ అధికారి అఖిలేష్ సింగ్ నేతృత్వంలోని టీం విడిపోయి దర్యాప్తు ప్రారంభించింది. దీంతో రాజకీయ ప్రకంపనలు రేకెత్తించింది. నిందితుల జాబితా రాష్ట్ర పోలీసులు ఇచ్చినదేనని సమాచారం.
తృణమూల్ కు చెందిన నాయకుడు అనరుల్ హుస్సేన్ ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని టాక్. బీర్ భూమ్ లోని రాంపూర్ హాట్ పట్టణానికి సమీపంలోని బొగ్గుయ్ గ్రామంలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలను వారి ఇళ్లల్లో బంధించి సజీవ దహనం చేశారు.
ఈ ఘటనలో 20 మందిని అరెస్ట్ చేశారు. అయితే బాంబు దాడిలో మరణించిన స్థానిక టీఎంసీ నాయకుడు భాదు షేక్ హత్యకు ప్రతీకరంగా ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
Also Read : భారతీయ ఉత్పత్తుల ప్రతిష్టను పెంచాలి