Rakesh Tikait : దేశ వ్యాప్తంగా రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి, కిసాన్ సంయుక్త మోర్చ అగ్ర నేత రాకేశ్ తికాయత్ కు చంపుతామంటూ బెదిరింపు కాల్ వచ్చింది.
ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన రైతుల పక్షాన ఉంటూ పోరాడారు. ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను ఆయన టార్గెట్ చేశారు. కార్పొరేట్ కంపెనీలపై మండిపడుతూ వస్తున్నారు రాకేశ్ తికాయత్(Rakesh Tikait).
తికాయత్ కు ఫోన్ బెదిరింపు కాల్ రావడంతో యూపీలో కలకలం రేగింది. పలువురు నాయకులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజాస్వామిక వాదులు, రైతు సంఘాల నేతలు ఆరా తీశారు.
దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి చంపేస్తానంటూ బెదిరింపులు వచ్చాయని దూషించాడు. దీంతో రాకేష్ తికాయత్ వ్యక్తిగత డ్రైవర్ పెర్ద్వల్ త్యాగి సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో దర్యాప్తు ప్రారంభించినట్లు ముజఫర్ నగర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. సబ్ ఇన్స్ పెక్టర్ రాకేశ్ శర్మ నేతృత్వంలోని పోలీసు బృందం రాకేశ్ తికాయత్(Rakesh Tikait) నివాసాన్ని సందర్శించారు.
ఫోన్ ఎవరు చేశారనే దానిపై ఆరా తీశారు. దీంతో రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ కు పోలీసు భద్రత కల్పించనున్నట్లు వెల్లడించారు ఎస్పీ. ఇటీవలే ఆయన మరోసారి కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రైతులను మోదీ మోసం చేశారంటూ ఆరోపించారు. ఎంఎస్పీ ప్రకటించేంత దాకా తాము ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ తరుణంలో బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది.
Also Read : గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణం