TTD : కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరుమల తిరుపతి దేవస్థానం మెల మెల్లగా మార్గదర్శకాలను సడలిస్తూ వస్తోంది. ఈ మేరకు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి రద్దు చేసిన వయో వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ సదవకాశం ఏప్రిల్ 1 నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రత్యేక దర్శనాలు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఎన్నడూ లేని రీతిలో 2020 మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనాలకు పర్మిషన్ తాత్కాలికంగా రద్దు చేసింది.
ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా టీటీడీ (TTD )ట్రయల్ రన్ చేపట్టింది. జూన్ 11 నుంచి 6 వేల మందికి దర్శన భాగ్యం కల్పించింది. క్రమేపి భక్తుల సంఖ్యను 75 వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తోంది.
వర్చువల్ సేవకు భక్తుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను ఏర్పాటు చేసింది టీటీడీ.
అంతే కాకుండా ఈసారి ఆర్జిత, నిత్య సేవలలో ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. ఈ తరుణంలో వయోవృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల విషయంలో మరోసారి మానవతా దృక్ఫథంతో ఆలోచించింది టీటీడీ(TTD ).
గత రెండు ఏళ్లుగా ఈ దర్శనం నిలిపి వేసింది. రోజుకి 1000 టికెట్ల చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. అయితే వీరికి ఆన్ లైన్ లో లేదా ఎప్పటి లాగే టోకెన్లు జారీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : దేదీప్యమానం యాదగిరిగుట్ట వైభవం