Amit Shah : కేంద్ర మంత్రి (Central Minister) అమిత్ చంద్ర షా (Amit Shah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి (BJP) రాజకీయాలు చేయడం తెలియదన్నారు. తమ లక్ష్యం, మార్గం శాంతి మంత్రమని చెప్పారు. హింసకు పాల్పడడం తమ అభిమతం కాదని స్పష్టం చేశారు.
మాకంటూ ఓ సిద్ధాంతం ఉంది. మా నాయకత్వంపై కోట్లాది మంది ప్రజలు నమ్మకాన్ని పెట్టుకున్నారు. మేం చేసిన పనులు, అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ముందుంచి తాము ఓట్లు అడుగుతామని రాజకీయాలు చేసే ప్రసక్తి లేదన్నారు.
ప్రత్యర్థి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులను చంపడం, వారి కుటుంబాలపై అత్యాచారాలకు పాల్పడే సంస్కృతి కాషాయానిది కాదన్నారు ట్రబుల్ షూటర్.
తాము హింసా రాజకీయాలు చేస్తున్నామంటూ టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్స్ చేయడంపై అమిత్ షా (Amit Shah) పరోక్షంగా పై కామెంట్స్ చేశారు.
కుటుంబ రాజకీయాలను అడ్డం పెట్టుకుని కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లు తమను బద్నాం చేయడం దారుణమన్నారు. ఆయా పార్టీలలోనే ప్రజాస్వామ్యం పడకెక్కిందని తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.
దేశమంతా బీజేపీని (BJP) పవర్ లోకి తీసుకు రావాలన్నదే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. దాని కోసం ఏమైనా చేస్తామని ఎందాకైనా వెళతామని ప్రకటించారు.
బీర్బూం హత్యా కాండ కేసులో బీజేపీ (BJP) వేలు పెడుతోందన్న సీఎం దీదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అమిత్ షా (Amit Shah) .
Also Read : మీడియాపై మండిపడ్డ రాం దేవ్ బాబా