Ramdev Baba : ఇంధన (Petrol Diesel) ధరల పెంపుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు యోగా గురు రాం దేవ్ బాబా(Ramdev Baba ). రోజు రోజుకు కేంద్ర సర్కార్ ఇంధన కంపెనీలను నియంత్రించ లేక పోతున్నాయంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సీరియస్ అయ్యారు.
ఒక రకంగా మీడియా ప్రతినిధిపై నోరు పారేసుకున్నాడు. తాను 20 గంటలు కష్టపడి పని చేస్తున్నానని, ప్రధానమంత్రి కేవలం 2 గంటలే నిద్ర పోతున్నారని దేశ ప్రజలంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.
ఇంధన ధరలు తగ్గితే పన్ను రాదంటోంది కేంద్ర సర్కార్. అప్పుడు దేశాన్ని నడపడం చాలా కష్టమవుతుందన్నారు రాం దేవ్ బాబా (Ramdev Baba) . జీతాలు ఎలా చెల్లిస్తారని, రోడ్లు ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు.
అంతే కాదు రిపోర్టర్ పై నోరు మూసుకోండి. మీకు మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చారు.పెట్రోల్ (Petrol) ధరల తగ్గింపుపై గతంలో తాను చేసిన కామెంట్స్ గురించి అడిగిన ఓ జర్నలిస్టులను ఆయన బెదిరించడం కలకలం రేగింది.
అప్పట్లో రాం దేవ్ బాబా పెట్రోల్ (Petrol) , డీజిల్ (Diesel) లీటర్ కు రూ. 40 , గ్యాస్ సిలిండర్ రూ. 300కి అందించాలని డిమాండ్ చేశారు. కానీ ప్రస్తుతం మాట మార్చారు రాం దేవ్ బాబా(Ramdev Baba). అవును గతంలో చెప్పాను.
కానీ ఇప్పుడు సమాధానం ఇచ్చేందుకు నేను మీ కాంట్రాక్టర్ ను కానన్నారు రాం దేవ్ బాబా. ఇదే విషయాన్ని అడిగిన మీడియా ప్రతినిధిని నానా రకాలుగా మాట్లాడారు.
అంతే కాదు బెదిరింపు ధోరణితో వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి నెట్టింట్లో.
Also Read : యడ్యూరప్పకు కోర్టు సమన్లు