BS Yediyurappa : ట్రబుల్ షూటర్ గా పేరొందిన భారతీయ జనతా పార్టీ (BJP) అగ్ర నేత, మాజీ కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్పకు (BS Yediyurappa)కోలుకోలేని షాక్ తగిలింది. ఇదిలా ఉండగా బెంగళూరు (Bengaluru) ప్రత్యేక కోర్టు యెడ్డీపై నమోదైన కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది.
భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
వెంటనే అరెస్ట్ చేయాలంటూ సమన్లు జారీ చేయడం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. దక్షిణాది రాజకీయాలలో ఏ టైం లోనైనా చక్రం తిప్పే దమ్మున్న నాయకుడిగా బీఎస్ యెడ్యూరప్పకు పేరుంది.
కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడవలవుతాయి. ఇదిలా ఉండగా భూ వ్యవహారానికి సంబంధించి డీ నోటిఫికేషన్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ యెడ్డీ (BS Yediyurappa)ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
దీంతో ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. వెంటనే ఈ ఆరోపణలపై విచారణ జరపాలని ఆదేశించడం విశేషం.
ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న కేసులను విచారించేందుకు గాను స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసింది. 2013లో యెడ్డీపై కేసు నమోదైంది.
ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చోటు చేసుకుంది. బెంగళూరుకు (Bengaluru) చెందిన వాసుదేవ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. యెడియూరప్ప కేసు విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు స్పెషల్ జడ్జి జయంత్ కుమార్.
Also Read : కేజ్రీవాల్ ను చంపాలని చూశారు