#BangaruBullodu : జనవరి 23న ధియేటర్లలో సందడి చేయనున్న బంగారు బుల్లోడు!!
Bangaru Bullodu : అల్లరి నరేష్ హీరోగా పూజా జవేరి హీరోయిన్ గా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం “బంగారు బుల్లోడు”. జనవరి 23న రిలీజ్ కానున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల
Bangaru Bullodu : అల్లరి నరేష్ హీరోగా పూజా జవేరి హీరోయిన్ గా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం “బంగారు బుల్లోడు”. జనవరి 23న రిలీజ్ కానున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం నేడు ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. అల్లరి నరేశ్, పూజా జవేరి, కమెడియన్స్ ప్రభాస్ శ్రీను, భద్రం, నటి రజిత, రచయిత వెలిగొండ శ్రీనివాస్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, లైన్ ప్రొడ్యూసర్ మహేష్, కెమెరామెన్ సతీష్ ముత్యాల తదితరులు పాల్గొన్నారు..
హీరో నరేష్ మాట్లాడుతూ.. ‘ పాండమిక్ తర్వాత సంక్రాంతి కి సినిమాలు రిలీజ్ అయి బాగా అడుతున్నాయి. మా అందరికీ చాలా నమ్మకం కలిగింది. బంగారు బుల్లోడు(Bangaru Bullodu) జనవరి 23న రిలీజ్ అవుతుంది. కథలో కామెడీ రన్ అవుతూ.. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా గిరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వెలిగొండ శ్రీను బ్యూటిఫుల్ డైలాగ్స్ రాశాడు. ఒక మంచి సినిమా చేశాం. సినిమా చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. చాలా ఎగ్జైట్ గా ఉంది. సాయి కార్తీక్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. స్వాతిలో ముత్యమంత సాంగ్ రీమేక్ చేశాడు. ఎక్స్ ట్రార్డినరి రెస్పాన్స్ వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా నటించారు. తప్పకుండా ఈ చిత్రం అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. బాలకృష్ణ గారి బంగారు బుల్లోడు కి మా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక బంగారు షాప్ లో వర్క్ చేస్తూ గ్రామీణ బాంక్ లో పనిచేసే వాడి కథ. బంగారు తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తుంటాడు. అందుకే ఈ సినిమాకి బంగారు బుల్లోడు టైటిల్ పెట్టడం జరిగింది. అడగ్గానే ఈ టైటిల్ ఇచ్చిన బాలకృష్ణ గారికి, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కి నా థాంక్స్.. అన్నారు.
హీరోయిన్ పూజా జవేరి మాట్లాడుతూ.. ‘ వన్ ఇయర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ట్రైలర్ లాంచ్ లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఈ 23న మా బంగారు బుల్లోడు(Bangaru Bullodu) రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి నిర్మాతలకు మరిన్ని లాభాలు రావాలి. సాయి కార్తీక్ తో థర్డ్ ఫిల్మ్ ఇది. మంచి సాంగ్స్ ఇచ్చారు. నరేష్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. షూటింగ్ అంతా చాలా ఫన్నీగా, స్మూత్ గా జరిగింది. సినిమా చాలా బిగ్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్తో ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన అనిల్, కిషోర్ గిరి గారికి నా థాంక్స్.. అన్నారు.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ‘ ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో ఇది ఐదవ సినిమా. నరేష్ తో 4వ సినిమా. ఇందులో మూడు సాంగ్స్ ఉన్నాయి. పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా స్వాతిలో ముత్యమంత పాట రీమిక్స్ చేశాం. అది చాలా పెద్ద హిట్ అయింది. అపాట బాగా చేశాం. రీమిక్స్ అనేది ఇప్పటివరకు చెడగొట్టకుండా బాగా చేశాను. బయట కూడా అదే మంచి పేరు ఉంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని గిరి రూపొందించాడు. నా లక్కీ నంబర్ 5. ఈనెల 23న విడుదలవుతున్న ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి మంచి పేరు రావాలి.. అన్నారు.
రచయిత వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ నరేష్ గారితో చేసిన అన్నీ సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఒక ఫ్యామిలీ లో జరిగే కథ ఇది. అందులోనే కామెడీ ట్రావెల్ అవుతుంది. మరో కొత్త కోణంలో నరేష్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయన కేరియర్ లో ఈ చిత్రం బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. చిన్న పిల్లలు దెగ్గరునుండి పెద్దవాళ్ళ వరకు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈరోజే సినిమా చూశాం. మేమందరం బాగా నవ్వుకుని ఎంజాయ్ చేశాం. అలాగే ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీలవుతారు. సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా ఈ చిత్రం లేడీస్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. అన్నారు.
చిత్ర దర్శకుడు గిరి పాలిక మాట్లాడుతూ.. ‘ నందిని నర్సింగ్ హోమ్ చిత్రం తర్వాత చేసిన సినిమా ఇది. బెండు అప్పారావు తర్వాత పక్కా విల్లేజ్ బ్యాక్ డ్రాప్ కథతో నరేష్ సినిమా చేయలేదు. అలాంటి సినిమా చేయాలని ఈ కథ రాయడం జరిగింది. కథలో క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతూ ఈ సినిమా రన్ అవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. సాయి కార్తీక్ మ్యూజిక్, సతీష్ కెమెరా వర్క్ చాలా ప్లస్ అయింది. ఆర్టిసులు, టెక్నీషియన్స్ అందరూ నాకు బాగా కోపరేట్ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి, కిషోర్ గారికి నా థాంక్స్.. అన్నారు.
కమెడీయన్ ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ.. నరేష్ నిజంగా బంగారు బుల్లోడు(Bangaru Bullodu). ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేసి మాలాంటి ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వాలని.. మరిన్ని సక్సెస్ లు ఆయన సాధించాలని అన్నారు.
భద్రం మాట్లాడుతూ.. డైరెక్టర్ గిరిది మాది, ఇద్దరిది రాజమండ్రినే. ఈ మూవీలో ఒక మంచి వేషం ఇచ్చారు. చాలా రోజుల తరువాత కడుపుబ్బా నవ్వుకునే సినిమా వస్తుంది. అందరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా.. అన్నారు.
నటి రజిత మాట్లాడుతూ.. ‘ 24 క్యారెక్టర్స్ గోల్డ్ మా నరేష్. ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్.. ప్రేక్షకులకు విందు బోజనంలా ఈ సినిమా ఉంటుంది. షూటింగ్ చేసేటప్పుడే మా యూనిట్ అంతా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. సీన్స్ అన్నీ కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటాయి. ఏకే అంటే నా మాతృ సంస్థ. చాలా సినిమాలు చేశాను. 23న వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
No comment allowed please