Nitish Kumar : తాగుబోతులు భార‌తీయులు కాదు 

బీహార్ సీఎం నితీష్ కుమార్ కామెంట్స్ 

Nitish Kumar : బీహార్ సీఎం  నితీష్ కుమార్ రోజుకో సంచ‌ల‌న కామెంట్స్ తో దేశంలో క‌ల‌క‌లం సృష్టిస్తున్నారు. ఆయ‌న రూటే స‌ప‌రేట్ అన్న మాట‌ను నిజం చేసే ప‌నిలో ప‌డ్డారు.

ఈ త‌రుణంలో నిన్న తాను రాజ్య‌స‌భ‌కు వెళతాన‌ని ప్ర‌క‌టించిన నితీష్ కుమార్ (Nitish Kumar) గురువారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాగుబోతులు, మ‌ద్యాన్ని సేవించే వారు, సేవించాల‌ని అనుకుంటున్న వారు, మద్యం ప్రియులు భార‌తీయులు కారంటూ బాంబు పేల్చారు.

ప్ర‌స్తుతం నితీష్ కుమార్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌ద్యం అన్నది జీవితాల‌ను నాశ‌నం చేస్తుంది. స‌భ్య స‌మాజాన్ని చెడ‌గొడుతుంది. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పేర్కొన్నారు బీహార్ సీఎం.

మ‌ద్యం వ‌ల్ల ఆరోగ్యం తో పాటు జేబులు ఖాళీ అవుతాయ‌ని తెలుసు. కానీ వాళ్లు దాని తాగ‌కుండా ఉండ లేరంటూ పేర్కొన్నారు నితీష్ కుమార్(Nitish Kumar). తాము పలుమార్లు ప్ర‌భుత్వ ప‌రంగా ప్ర‌జ‌ల‌ను మ‌ద్యం సేవించ వ‌ద్దంటూ పిలుపు ఇచ్చామ‌ని చెప్పారు.

మ‌ద్యం సేవించే వారిని పాపులంటూ పేర్కొన్నారు సీఎం. విష పూరిత మ‌ద్యం సేవించే వారు అనుకోని ప‌రిస్థితుల్లో మ‌ర‌ణిస్తే ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు నితీష్ కుమార్.

మ‌హాత్మా గాంధీ కూడా మ‌ద్య‌పానాన్ని వ్య‌తిరేకించార‌ని, ఆయ‌న సిద్దాంతాల‌కు విరుద్ద‌మైన వారు మ‌హా పాపులంటూ ఎద్దేవా చేశారు. నేను వీరిని భార‌తీయులుగా ప‌రిగ‌ణించ బోనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

మ‌ద్య నిషేధాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌క పోవ‌డం వ‌ల్ల‌నే మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయంటూ విప‌క్షాలు చేసిన ఆరోప‌ణ‌ల‌పై సీఎం స్పందించారు.

Leave A Reply

Your Email Id will not be published!